Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి మారుతీ ప్రసాద్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి. దేవి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా ఈ బి దేవి అధ్యక్షతన కార్యాలయం నందు సమావేశ భవన కార్యాలయం లో స్టాటిస్టిక్స్ అధికారిగా పనిచేస్తూ నిన్నటి దినము పదవీ విరమణ పొందిన మారుతి ప్రసాద్ పదవీ విరమణ వీడ్కోలు సన్మాన సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా డి యం హెఛ్ ఓ డా .ఈ బి దేవి మాట్లాడుతూ మారుతీ ప్రసాద్ ఆరోగ్య శాఖ నందు సుమారు 36 సంవత్సరాలుగా పనిచేయడం జరిగినదని ఎక్కడ పనిచేసిన. ఎంతో అంకిత భావంతో పనిచేసేవారన్నారు. ఆరోగ్య శాఖ లో ప్రజలకు అందించే. వైద్య సేవల యొక్క. వివరాలను ఎప్పటి కప్పుడు అధికారులకు ప్రభుత్వానికి అందించడంలో స్టాటిస్టిక్స్ విభాగం అధికారి యొక్క విధులు ముఖ్యమైనవని. అలాంటి విధులను శ్రీ మారుతీ ప్రసాద్ చక్కగా నిర్వర్తించారని తెలిపారు . డ్యూటీని నే పరమావధిగ భావించే వ్వక్తి మారుతి ప్రసాద్. అని కొనియాడారు. ఈ లాంటి వారిని ఈతరం సిబ్బంది ఆదర్శ ముగా తీసుకోవాలని కోరారు.
ఇదే సందర్భంలో ప్రోగ్రాం అధికారులు డా.సుజాత ,డా యుగంధర్ ,డా అనుపమ జేమ్స్ డా నారాయణ స్వామి , డా రవిశంకర్ , సిపిఓ శ్రీ అశోక్ ,జిల్లా మలేరియా అధికారి ఓబులు. కార్యాలయ పరిపాలన అధికారి గిరిజ మనోహర్ రావు , డెమో ఉమాపతి , పాల్గొని వైద్య శాఖ లో శ్రీ మారుతీ ప్రసాద్ అందించిన సేవలు గూర్చి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ డెమో త్యాగరాజ ,డిప్యూటీ హెఛ్ ఈ ఓ గంగాధర్ ,విజయభాస్కర్ రెడ్డి. శ్రీనివాసులు , డెప్యూటీ ఎస్ ఓ గోవింద గౌడ్ ,యన్ హెఛ్ యం కిషోర్ ,అసోసియేషన్ నాయకులు. పద్మజ ,లక్ష్మన్న , మోహన్ బాబు ,జమీలా, తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img