Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అరకు పార్లమెంటు సీటు కోసం ” పసుపులేటి ” ప్రయత్నాలు

బాలరాజుకు అవకాశం కల్పిస్తే సమన్యాయం చేసినట్లవుతుందని అభిప్రాయపడుతున్న ప్రజలు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా అరకు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఆయన తదనంతరం జనసేన పార్టీలో చేరి అనతి కాలంలోనే వైకాపాలో చేరిన విషయం పాఠకులకు తెలిసింది. ఈ క్రమంలో నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఒకానొక దశలో తన కుమార్తెను జడ్పిటిసి గా పోటీ చేయించాలని ప్రయత్నించారు. అవకాశం రాకపోవడంతో 2024 ఎన్నికలలో పాడేరు శాసనసభ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో జరిగిన వైకాపా సమన్వయకర్తల నియామకాల లోనైనా సరే తనకు ప్రాధాన్యత ఉంటుందని భావించారు. సమీకరణాలంటూ అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, అరకు శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తగా మత్స్యరాస విశ్వేశ్వర రాజు లను వైకాపా అధినాయకత్వం నియమించిన నేపథ్యంలో అరకు పార్లమెంట్ సమన్వయకర్త ను మార్చాలంటూ అరకు పార్లమెంటు పరిధిలోని వైకాపా నాయకులు నిరసన గళం వినిపిస్తున్న నేపథ్యంలో ఆ స్థానం నుంచి తనకు అవకాశం కల్పించాలంటూ అధిష్టానానికి పసుపులేటి బాలరాజు అర్జీ పెట్టుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. ఇప్పటికే నియమించిన సమన్వయకర్తల జాబితాలో మాధవి కొండ దొర సామాజిక వర్గానికి చెందినవారు కాగా, భాగ్యలక్ష్మి, విశ్వేశ్వర రాజు లు భగత సామాజిక వర్గానికి చెందినవారు. ఈ క్రమంలో వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదంటూ ఆ సామాజిక వర్గం అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పసుపులేటి బాలరాజు కు అరకు పార్లమెంట్ స్థానం నుండి అవకాశం కల్పించినట్లయితే కొండ దొర, భగత, వాల్మీకి తెగలకు సమన్యాయం చేసినట్లు అవుతుందని ఈ ప్రాంతీయలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img