Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

లెక్క తేలింది!

. బీజేపీ, జనసేనకు కలిపి ఎనిమిది ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు
. అమిత్‌షాతో ఫలించిన చంద్రబాబు, పవన్‌ చర్చలు
. ఎన్డీయేలోకి టీడీపీని స్వాగతించిన అమిత్‌షా, నడ్డా
. 17న చిలకలూరిపేటలో ఉమ్మడి సభ`రానున్న మోదీ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేటాయించే సీట్ల లెక్క తేలింది. ఎన్నికల షెడ్యూలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు, సీట్లు సర్డుబాటు కొలిక్కి వచ్చేలా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా దిల్లీలో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో కలిసేందుకు శుక్రవారం వీలు కలగకపోవడంతో శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. 50 నిమిషాల పాటు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని కేటాయించినా ఇబ్బంది లేదు గానీ, ఎంపీ సీట్లు ఎక్కువ కావాలని బీజేపీ పట్టుబట్టగా, దానివల్ల ప్రత్యర్థి పార్టీకి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. దానికిగల కారణాలను వివరించారు. ఎట్టకేలకు ఆరు ఎంపీ సీట్లకు అమిత్‌ షా అంగీకరించినట్లు తెలిసింది. నాలుగు లేదా ఐదు సీట్లకు చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయగా, పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకుని తమ పార్టీకిచ్చిన మూడిరటిలో ఒక సీటు తగ్గించుకుంటామని చెప్పినట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ, జనసేన పార్టీలు రెండిరటికీ కలిపి ఎనిమిది ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లు కేటాయించేలా అంగీకారం కుదిరింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని ముగ్గురు నేతలు నిర్ణయించారు. తొలుత నేషనల్‌ డెమోక్రటిడ్‌ అలయెన్స్‌ (ఎన్డీయే)లో చేరాలని చంద్రబాబుని అమిత్‌ షా ఆహ్వానించారు. త్వరలో జరిగే ఎన్డీయే భేటీకి హాజరు కావాలని కోరారు. అనంతరం అమిత్‌ షా, చంద్రబాబు పరస్పరం పుష్పగుచ్ఛాలు అందజేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. జనసేన ఇప్పటికే ఎన్డీయే కూటమిలో చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలుండగా, బీజేపీ, జనసేన పార్టీలకు 30 సీట్లు కేటాయించారు. మిగిలిన 145 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో 8 సీట్ల బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేయనుండగా, 17 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది.
స్వాగతించిన నడ్డా
ఎన్డీయేలో చేరి బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘మోదీ నాయకత్వంలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయి. దేశాభివృద్ధికి మోదీ పదేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మా పొత్తు ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు దోహదమవుతుంది. బీజేపీ, టీడీపీ మధ్య స్నేహం ఈనాటిది కాదు. టీడీపీ 1996లోనే ఎన్డీయేలో చేరింది. వాజ్‌పేయి, మోదీ ప్రభుత్వంలో కలిసి పనిచేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జనసేన తన వంతు మద్దతు ఇచ్చింది’ అని నడ్డా పేర్కొన్నారు.
రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం :చంద్రబాబు
బీజేపీ, జనసేన పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు పూర్తయిన అనంతరం దిల్లీ నుంచి టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలి. సీట్ల సర్దుబాటుపై పూర్తి స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయిస్తాం. ఎలాంటి గందరగోళం లేదు’ అని చంద్రబాబు అన్నారు.
17న ఉమ్మడి సభకు ప్రధాని మోదీ
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈనెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఎన్డీయేలో టీడీపీ చేరిన తర్వాత జరగబోయే తొలి సభ కావడంతో ప్రధాని మోదీ హాజరవుతారని చంద్రబాబు తెలిపారు.10`15 లక్షల మందితో భారీ సభను నిర్వహించాలని, ఇందుకు విశాల ప్రాంగణాన్ని ఎంపిక చేసి, విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img