Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

సీనియర్లకు మళ్లీ భంగపాటు

. 34 మందితో టీడీపీ మలి జాబితా
. సోమిరెడ్డి, దేవినేని, గంటా, కళా, బండారులకు దక్కని చోటు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : టీడీపీ మలి జాబితాలోనూ సీనియర్లకు చుక్కెదురైంది. జనసేన, బీజేపీతో పొత్తు క్రమంలో సీట్ల సర్దుబాటులో తమ పార్టీ సీనియర్లకు స్థానం కల్పించలేని స్థితి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏర్పడిరది. జనసేన 21, బీజేపీ 10, టీడీపీ 144 చొప్పున అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా విడుదలైంది. గురువారం 34 మందితో మలి జాబితాను విడుదల చేశారు. ఇక పొత్తులో భాగంగా టీడీపీ మరో 16 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాస్‌, బండారు సత్యనారాయణ తదితరులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎచ్చెర్ల స్థానాన్ని కళా వెంకట్రావు, చీపురుపల్లి సీటును కిమిడి నాగార్జున కోరారు. గంటా శ్రీనివాస్‌… భీమిలి సీటును, బండారు సత్యనారాయణ పెందుర్తి, మైలవరం సీటును దేవినేని ఉమా ఆశించారు. పుట్టపర్తి టికెట్‌ బీసీల్లోని వడ్డెర సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించారు. పార్టీ సీనియర్లు వారికి సర్ది చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లాలో మైలవరం సీటుపై ప్రతిష్ఠంభన నెలకొంది. మైలవరం సిట్టింగ్‌ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో మైలవరం స్థానాన్ని ఆయనకే ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన దేవినేని ఉమా సీనియర్‌ నేత కావడంతో అతనికి ఎలా న్యాయం చేయాలా అని మల్లగుల్లాలు పడుతోంది. పెనమలూరు మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్‌ మరలా టికెట్‌ ఆశిస్తుండగా, ఆ స్థానాన్ని దేవినేని ఉమా లేదా ఎంకే బేగ్‌కు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. ఈ నియోజకవర్గంలో 40వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి. బేగ్‌కు టికెట్‌ ఇవ్వడం వల్ల ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లవుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు టీడీపీలోకి రావడంతో సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి టికెట్‌ ప్రశ్నార్థకమైంది. మొత్తానికి మలి జాబితాలో సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో చివరి జాబితాపై నేతలు ఆశలు పెట్టుకున్నారు.
రెండో జాబితా
మలి జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. అభ్యర్థుల్లో పీహెచ్‌డీ చేసిన ఒక్కరికి అవకాశం లభించింది. 11 మంది పీజీ చేసిన వారున్నారు. గ్రాడ్యుయేట్లు తొమ్మిది మంది, ఇంటర్‌ చదివిన వారు ఎనిమిది మంది, పదో తరగతి పూర్తిచేసిన వారు ఐదుగురు ఉన్నారు.
బ నరసన్నపేట – బగ్గు రమణ మూర్తి బ గాజువాక – పల్లా శ్రీనివాసరావు
బ చోడవరం – కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు బ మాడుగుల – పైలా ప్రసాద్‌
బ ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ బ రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాశ్‌
బ రాజమండ్రి రూరల్‌ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
బ రంపచోడవరం – మిర్యాల శిరీష బ కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
బ దెందులూరు – చింతమనేని ప్రభాకర్‌ బ గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
బ పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్‌ బ గుంటూరు వెస్ట్‌ – పిడుగురాళ్ల మాధవి
బ గుంటూరు ఈస్ట్‌ – మహ్మద్‌ నజీర్‌ బ గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
బ కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావుబ మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
బ గిద్దలూరు – అశోక్‌ రెడ్డి బ ఆత్మకూరు – ఆనం రాంనారాయణ రెడ్డి
బ కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బ వెంకటగిరి – కురుగొండ్ల లక్ష్మీప్రియ
బ కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి బ ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
బ నందికొట్కూరు (ఎస్సీ) – గిత్తా జయసూర్య
బ ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
బ మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి బ పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
బ కదిరి- కందికుంట యశోదా దేవి బ మదనపల్లె- షాజహాన్‌ బాషా
బ పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
బ చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్‌ (నాని)
బ శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి
బ సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
బ పూతలపట్టు- డాక్టర్‌ కలికిరి మురళీ మోహన్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img