Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అన్నమయ్య జీవిత చరిత్ర అందరికీ ఆదర్శం.. డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ

విశాలాంధ్ర- ధర్మవరం : అన్నమయ్య జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని శ్రీ లలితా నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ, కమలా బాలాజీ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు అన్నమాచార్య జయంతి వేడుకలను బ్రాహ్మణ వీధిలోని శ్రీ లలితా నాట్య కళా నికేతన్ కార్యాలయంలో నగర సంకీర్తనలు చేసుకుంటూ 60 మంది నాట్యం నేర్చుకున్న విద్యార్థులతో ఊరేగింపుగా శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయమునకు చేరుకున్నారు. అక్కడ ఉన్న అన్నమయ్య విగ్రహానికి జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. తదుపరి డాన్స్ గురువు బాబు బాలాజీ, కమలా బాలాజీలు మాట్లాడుతూ అన్నమాచార్యులు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శప్రాయులు అయ్యారని, వారి సంకీర్తనలు నలుమూలల వ్యాపించి, మంచి మార్గదర్శకకు ఎంతో కీలకపాత్ర వహించాయని తెలిపారు. అనంతరం వేసవి కాలంలో సమ్మర్ క్యాంపులో నాట్యం నేర్చుకుంటున్న 60 మంది విద్యార్థినీలచే అన్నమయ్య సంకీర్తనలతో పాటు భరతనాట్యం, కూచిపూడి, కోలాటం ప్రదర్శించిన వైనం అందరిని ముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ తీర్థాల రమణ దంపతులు, విద్యార్థుల తల్లిదండ్రులు, భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img