Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

ఆర్థిక కష్టాలున్నాయ్‌… నిధులివ్వండి

. నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు వినతి
. రాజ్‌నాథ్‌, నడ్డాతోనూ భేటీ
. అమరావతికి పూర్వవైభవమే లక్ష్యమని వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటనలో రెండోరోజూ తీరిక లేకుండా గడిపారు. తొలిరోజు ప్రధాని నరేంద్రమోదీతో సహా ఏడుగురు కేంద్ర మంత్రులను కల్సి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై వినతిపత్రాలు అందజేసిన చంద్రబాబు… శుక్రవారం తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై సమగ్ర మెమోరాండాన్ని ఆమెకు అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాల్సిన అవసరం ఉందో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని వివరించారు. 2023-24లో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 33.32 శాతానికి చేరుకున్నాయని తెలిపారు. 2019-20లో అది 31.02 శాతమే ఉందని సీఎం గుర్తుచేశారు. అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున పెండిరగ్‌లో ఉన్న విభజన అంశాలను ఇకనైనా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవలెనూ కలిశారు.తర్వాత ఫిక్కీ చైర్మన్‌, ప్రతినిధులను, భారత్‌లో జపాన్‌ రాయబారితోనూ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు.
అమరావతికి పూర్వ వైభవం తెస్తాం: చంద్రబాబు
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానికి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ప్రతిష్ఠ జగన్‌ ప్రభుత్వంలో దెబ్బతిందని, మరలా ఏపీ రాజధానికి పూర్వవైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని చంద్రబాబాబు చెప్పారు. ఐదేళ్ల జగన్‌ పాలనతో సరిదిద్దలేనంత తీవ్ర నష్టం జరిగిందన్నారు. అమరావతిలో దాదాపు 135 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయని తెలిపారు. రాజధానికి అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించే పనిలో ఉన్నాం. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం వంటి ఐకానిక్‌ బిల్డింగ్‌లు సహా ఆగిపోయిన నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం. తొలుత నిర్మాణంలో ఉన్నవాటికి ప్రాధాన్యత ఇస్తాం. గతంలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ప్రణాళికా బద్ధంగా నిర్మాణాలు చేపడతాం. రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తాం.ఇందుకోసం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తాం. మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తాం. పీపీపీ నమూనా స్థానంలో పీ-4 విధానం తెస్తాం. దావోస్‌ పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతానని చంద్రబాబు తెలిపారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చునన్నారు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వొచ్చునని తెలిపారు. రానున్న ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని, అమరావతి రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీ ఎంపీలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img