Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పిటీషన్లు స్వీకరించడానికి దివ్యాంగుల వద్దకే వెళ్లిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా పోలీస్ సోమవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అనంతపురం, శెట్టూరు ప్రాంతాల నుండీ వేర్వేరుగా ఇద్దరు దివ్యాంగులు వచ్చారు. నడవలేని స్థితిలో రావడాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ దృష్టికి వెళ్లింది. వారు ఇబ్బంది పడకుండా ఎస్పీ గారు వెంటనే అక్కడి నుండీ నేరుగా కాన్ఫరెన్స్ హాలు బయట ఉన్న దివ్యాంగుల వద్దకు వెళ్లారు. ఈ ఇద్దరు దివ్యాంగుల సమస్యలను లోతుగా విన్నారు. చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కు ప్రజల నుండీ 117 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ ప్రజల నుండీ పిటీషన్లు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన నాణ్యతగా పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన పిటీషనర్లతో ఎస్పీ గారు ముఖాముఖి మాట్లాడారు. లోతుగా వారి సమస్యలను విని అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, అనంతపురం డీఎస్పీ టి.వి.వి ప్రతాప్, ఎస్బీ సి.ఐ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img