Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఒంటెద్దు పోకడల వల్లనే మన్యంలో తెదేపా పరాజయం

పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలుపుకుపోవడంలో విఫలమైన పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్.

వలస వచ్చిన వారికి ప్రాధాన్యత కల్పించడం వల్లనే మన్య ప్రాంతంలో పార్టీకి ఈ దుస్థితి.

తెదేపా మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య.

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు నియోజకవర్గంలో తెదేపా నాయకత్వం ఒంటెద్దు పోకడలకు పోవడం వల్లనే రాష్ట్రమంతటా ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం నమోదు చేసుకున్నప్పటికీ పాడేరు నియోజకవర్గం లో పరాభవం పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య అన్నారు. మండలంలోని పెద బరడ పంచాయతీ లోతుగెడ్డ జంక్షన్ లో ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బేరా సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లక్ష్మయ్య మాట్లాడుతూ వైకాపా నుండి వలస వచ్చిన తెదేపా పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఒంటెద్దు పోకడ వల్లనే పాడేరు నియోజకవర్గం లో తెదేపా చీలికలు, పీలికలుగా తయారైందన్నారు. తెదేపా ఆవిర్భావం నుండి క్రియాశీలక నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్న వారిని విస్మరించి రాజకీయాలు చేయడం ఆమెకు తగదన్నారు. ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి చింతపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు ఎంవివి సత్యనారాయణ ను శాసనసభ్యునిగా గెలిపించుకునేందుకు కృషి చేశామన్నారు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలను తూచా తప్పకుండా నిర్వహించే చిత్తశుద్ధి గల కార్యకర్తలుగా నేటికీ ఉన్నామన్నారు. ఏ పార్టీ నుంచి తాము వలస రాలేదన్నారు. నాడు పాడేరు నియోజకవర్గంలో శాసన సభ్యురాలిగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మత్స్యరాస మణికుమారి, జిసిసి చైర్మన్ గా పనిచేసిన ఎం వి వి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బొర్ర నాగరాజు, పాడేరు, చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లుగా పనిచేసిన బొర్ర విజయరాణి, దుచ్చరి చిట్టిబాబు, కొట్టగుల్లి సుబ్బారావు సహా అందరూ తెదేపాలో పార్టీ ఆవిర్భావం నుండి ఏ పార్టీ వైపు చూడకుండా మన్య ప్రాంతంలో తెదేపా లోపేతం కృషి చేసిన వారే అన్నారు. ఈ క్రమంలోనే చింతపల్లి, జికేవీధి మండల అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసిన దివంగత షేక్ నాజర్ వల్లి, పలాస కొండలరావు సహా బౌడు రాజారావు, బౌడు చిన్న రామమూర్తి, బేరా రామలింగంపడాల్, ఇలా అనేకమంది మన్య ప్రాంతంలో పార్టీ నిర్మాణానికి కృషి చేశారన్నారు. అటువంటి నాయకత్వం కలిగిన పార్టీలోకి వలస వచ్చిన నాయకులు నేడు పెత్తనం చేయడమే గాక పార్టీ నే నమ్ముకుని సర్వం పార్టీ కోసం అర్పించిన తమ వంటి నాయకులపై చర్యలు తీసుకుంటామని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేయడం గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు ఉందన్నారు. మన్య ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యం ఉంటే ఇన్చార్జిగా ఉన్న ఏ వ్యక్తి అయినా నాయకులు, కార్యకర్తలను కలుపుకోవాలన్నారు. తెదేపా ఇన్చార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరి, నాయకులుగా ఉన్న మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారి, ఎం వి వి ప్రసాద్, కిల్లు రమేష్ నాయుడు, నాగరాజు, విజయ రాణి, దుచ్చరి చిట్టిబాబు, కొట్టగుళ్లి సుబ్బారావు లలో ఏ ఒక్కరు సమావేశాలు నిర్వహించిన వారి పిలుపుమేరకు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు తమకేమీ అభ్యంతరం లేదన్నారు. తమను ఆహ్వానించని చోటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ అధిష్టానం కూడా పాడేరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రమంతటా ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తే మన్యం నియోజకవర్గాలలో వైకాపా విజయం సాధించడం వెనుక ఈ ప్రాంతంలోని నియోజకవర్గ ఇన్చార్జిల వైఫల్యం ఉందని అధిష్టానం గుర్తించాలన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి దివంగతులైన వారి కుటుంబాలకు పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టి న్యాయం చేయడంలో ఇంచార్జ్ వైఫల్యం ప్రస్ఫుటంగా కనబడుతుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పోవడంతో పాటు, దివంగతులైన పార్టీ శ్రేణులకు పార్టీ ద్వారా తగిన న్యాయం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పొత్తూరి. రాంబాబు, గడుతూరి రామరాజు, లకే. జోగిరాజు , కొత్తన్న నాయుడు, గొర్లె వెంకటరమణ, జనసేన నాయకుడు కేదారి రాజేష్ తదితర నాయకులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img