Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 23, 2024
Monday, September 23, 2024

ధర్మవరంకి సాటి మరేది లేదు

చేనేత రంగంలోనే కాదు.. తోలుబొమ్మల కళలో అగ్రగామే

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్

జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న శివమ్మకు సన్మానం

శివమ్మ ధర్మవరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు
విశాలాంధ్ర ధర్మవరం: చేనేత రంగంలోనే కాదు.. తోలుబొమ్మల కళలో కూడా ధర్మవరంకి సాటి మరేది లేదని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి లు పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మకు కేంద్ర ప్రభుత్వం శిల్పగురు అవార్డు రావడంపై వారు ఇరువురు హర్షం వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్, జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి స్వయంగా నిమ్మలకుంట గ్రామానికి వెళ్లి శివమ్మను అభినందించారు. ఆమెను ఘనంగా సత్కరించి.. శివమ్మ ప్రతిభను స్వయంగా చూశారు. ఈ సందర్భంగా శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో హస్తకళల విభాగంలో తోలుబొమ్మపై పెయింటింగ్ వేస్తున్న దళవాయి శివమ్మ మాత్రమే అవార్డుకు ఎంపిక కావడం ఆమె ప్రతిభకు తార్కాణం అని కొనియాడారు. తోలుపై శివమ్మ వేసిన శ్రీకృష్ణ చరిత పెయింటింగ్, విశ్వరూప హనుమాన్ తోలుబొమ్మ ఎంతో అద్భుతంగా ఉందన్నారు. కంప్యూటర్ యుగంలో కూడా హస్తకళతో జాతీయ స్థాయిలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారన్నారు. వాస్తవంగా చేనేత రంగంతో పాటు తోలుబొమ్మల తయారీ, పెయింటింగ్ ఎంతో కష్టం, ఓపికతో కూడకున్న పని అన్నారు. ఇందులో ఆదాయం తక్కువగా ఉన్నా.. వారు అనాదిగా వస్తున్న వృత్తిని మాత్రం మానలేదన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మరింత చేయూతనందించే ప్రయత్నం చేస్తామన్నారు. హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. తోలుపై అద్భుతంగా రూపొందించిన వీరి కలను కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్ప గురు జాతీయ చేతి వృత్తుల అవార్డు 2023లో పోటీలకు పంపగా అందులో శివమ్మకు ఈ అవార్డు దక్కడం తోలుబొమ్మల కళాకారులకు అదే విధంగా రాయలసీమ కళాకారులకు దక్కిన గౌరవం అని తెలిపారు. అలాగే ఇలాంటి కలలు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు ఆమె చేస్తున్న సేవలు అభినందనీయమని శివమ్మను స్ఫూర్తితో యువత ప్రాచీన కలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img