విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ నియోజకవర్గం చాబాల గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లెల జగదీష్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇటీవలె కురిసిన వర్షాలకు కొన్ని వీధి విద్యుత్ దీపాలు మరమ్మతులకు గురవడంతో గ్రామ పంచాయతీలో ప్రజలు రాత్రి సమయంలో వెలుతురు లేక ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మరమ్మతులకు గురైన వాటి స్థానంలో శనివారం నూతన వీధి విద్యుత్ దీపాలు ఏర్పాటు చెయ్యడం జరిగిందని సర్పంచ్ తెలిపారు.