Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

195.25 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

ట్రాక్టర్, రెండు సెల్ ఫోన్లు సీజ్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఒడిస్సా రాష్ట్రం నుండి మన్య ప్రాంతం మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 195.25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అందుకు బాధ్యులైన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని చింతపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే రమేష్ అన్నారు. సోమవారం చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అన్నవరం ఎస్సై రాజారావు, ఏఎస్ఐ రమణమూర్తి లతో కలిసి ఆయన మాట్లాడుతూ మన్య ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు అందిన ముందస్తు సమాచారంతో అన్నవరం ఎస్సై రాజారావు ఆధ్వర్యంలో లోతుగెడ్డ పంచాయతీ చెరుకుంపాకల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారన్నారు. అటుగా వస్తున్న ట్రాలీ ట్రాక్టర్ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసు బృందాన్ని చూసి ట్రాక్టర్ డ్రైవర్ సహా మరో వ్యక్తి ట్రాక్టర్ ను నిలిపి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని విచారించారన్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిలను విచారించగా కొంతమంది వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రంలోని చింతల్ ధూళి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ గంజాయిని తెచ్చి ఇవ్వడం జరిగిందని, ఆ గంజాయిని నర్సీపట్నం కు చెందిన వ్యక్తి తెచ్చి ఇచ్చిన ట్రాక్టర్లో డౌనూరు వరకు తెచ్చి అప్పగించాలనే ఒప్పందంతో జి మాడుగుల మండలానికి చెందిన లువ్వా సింగి పంచాయతీ కిల్లుపల్లి గ్రామానికి చెందిన పాంగి. శ్రీను కొర్ర సత్తిబాబు లను పదివేల రూపాయలు కూలిగా. చెల్లిస్తామని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోగా శ్రీను, సత్తి బాబు లు సోమవారం ట్రాక్టర్ సహాయంతో డౌనూరు వరకు తీసుకువెళ్లి నర్సీపట్నం కు చెందిన వ్యక్తికి అప్పగించేందుకు వెళుతుండగా పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు చెరుకుంపాకల సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించి ట్రాక్టర్లో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు శ్రీను, సత్తి బాబులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ 20 లక్షలు ఉంటుందన్నారు. డ్రైవర్ శ్రీను మరో వ్యక్తి సత్తిబాబు ల వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, 1200 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ట్రాక్టర్ ను నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లతో తిప్పుతున్నట్లు గుర్తించమన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ రిమాండ్ కు తరలించడం జరుగుతుందని, పరారీలో ఉన్న ఇతర నేరస్తులను త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. అదే క్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ లు అక్రమ వ్యాపారాలు నిర్వహించేందుకు మైదాన ప్రాంతాల నుంచి వచ్చి నగదు ఆశ చూపే వ్యాపారుల పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని గంజాయి నేరస్తులకు సహకరించి కేసులలో ఇరుక్కోవద్దని ఈ సందర్భంగా హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img