Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మాకేది సు “రక్ష “… మాకెందుకీ ” శిక్ష “

ఏం పాపం చేసామని మాకింతటి శాపం

ఆధార్, రేషన్ కార్డులు లేవు

బాలామృతానికి కూడా నోచుకోని పసికందులు

అవగాహన లోపంతో అధిక సంతానాన్ని కన్నాం, ఆలనా పాలన చూసుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేక అల్లాడుతున్నాం.

ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులు

విశాలాంధ్ర – చింతపల్లి( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అవగాహన లోపమే తమ కుటుంబానికి శాపంగా మారిందని ఊలం కృష్ణమూర్తి, సింహాచలం అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు మా ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఇటువంటి కుటుంబాలకు ఏమి చేసిందో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ కిన్నెర్ల (రాంనగర్ కాలనీ) గ్రామానికి చెందిన ఓ అభాగ్య కుటుంబ దీనగాధ ఇది. వివరాల్లోకి వెళితే మండలంలోని కొత్తపాలెం పంచాయతీ కిన్నెర్ల రామ్ నగర కాలనీకి చెందిన గెమ్మేల సింహాచలానికి, జీకే వీధి మండలం దేవరాపల్లి పంచాయతీ కొట్నాపల్లి గ్రామానికి చెందిన ఊలం కృష్ణమూర్తికి 14 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. నాటి నుండి వారు రాంనగర్ కాలనీలోనే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి రాజకుమారి, శ్రీహరి ప్రసాద్, ధారబాబు, దార కుమారి, వెంకటలక్ష్మి లతోపాటు మరో బాబు (ఇంకా పేరు పెట్టలేదు) అనే ఆరుగురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె రాజకుమారికి తప్ప మిగిలిన వారెవరికి ఆధార్ కార్డులు లేకపోగా ఆ కుటుంబానికి రేషన్ కార్డు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు ఆ కుటుంబానికి ఏ ప్రభుత్వం ద్వారానూ సంక్షేమ పథకాలు అందకపోగా కనీసం చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సదుపాయాలకు కూడా నోచుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. రేషన్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు పొందాలంటే పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ (పుట్టిన తేదీ) అవసరం. కానీ నిరక్షరాస్యులైన వారికి రేషన్ కార్డు ఉండాలని గాని, పుట్టిన పిల్లలకు పుట్టిన తేదీ ధ్రువ పత్రం అవసరం అని గాని దాని ద్వారా ఆధార్ కార్డు పొందాలన్న విషయాలు తెలియకపోవడం ఆశ్చర్యకరం. సింహాచలంను వివాహం ఆడడమే తాను చేసిన తప్పు అనుకున్నాడో, అంతమంది పిల్లలను కనడం శాపం అనుకున్నాడో తెలియదు గానీ గత ఆరు మాసాల క్రితం మూడో సంతానమైన ధారబాబును తీసుకుని భార్యతో పాటు మిగిలిన సంతానాన్ని విడిచి ఆ తండ్రి (కృష్ణమూర్తి) ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో ఐదుగురు సంతానాన్ని పోషించే బాధ్యత అభం శుభం తెలియని తనపై పడిందని ఆమె కన్నీటి పర్యంతం అయింది. తమను కృష్ణమూర్తి విడిచి వెళ్లిన నాటినుండి బాలింతరాలైన ఆమె పిల్లలను పోషించుకునేందుకు అష్ట కష్టాలు పడుతుంది. వారికి పట్టెడన్నం పెట్టేందుకు పాచి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదేదో కొండ కోనల నడుమ మారుమూల గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది అనుకుంటే పొరపాటే. లోతుగడ్డ జంక్షన్ నుండి పాడేరు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గ్రామం ఇది. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నో ప్రభుత్వాలు ఏలుబడి సాగించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మా ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది అంటూ ప్రకటనలు గుర్తచడం మినహా ఇటువంటి కుటుంబాలను గుర్తించకపోవడం అటు పాలకుల ఇటు అధికారుల నిర్లక్ష్యమని, ఏది ఏమైనా ఆ కుటుంబానికి, అభం శుభం తెలియని ఆ పిల్లలకు నేటి వరకు అన్యాయమే జరిగిందని చెప్పక తప్పదు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులు ఉన్నప్పటికీ నేటి వరకు వారికి తలదాచు కునేందుకు కనీసం గృహం లేకపోవడం, రేషన్, ఆధార్ కార్డుల వంటివి లేవంటే వారెంతటి దౌర్భాగ్య స్థితిలో జీవనం సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో జన్మించడమే తాము చేసిన తప్పా, మేమేమి పాపం చేసామని పసితనంలోనే భగవంతుడు మాకింతటి శాపాన్ని ఇచ్చాడనే విధంగా ఆ పసికందులు చూసే అమాయకపు చూపు చూస్తున్న, వింటున్న ప్రజల గుండె పిండేస్తుంది. తమను ఈ భూమి మీద పుట్టించడం ఆ దేవుడు చేసిన తప్పా? అవగాహన లేకుండా తమను కన్న తల్లి దండ్రుల తప్పా అన్నట్లు చూస్తున్న ఆ పిల్లలకు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. గత ప్రభుత్వాలన్నీ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇటువంటి కుటుంబాలను గుర్తించకపోవడం ఆ ప్రభుత్వాల వైఫల్యం కాదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలోనూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ధ్రువీకరణ పత్రాలు లేనివారిని గుర్తించి ధ్రువీకరణ పత్రాలు అందించడమే గాక సంక్షేమ పథకాలను లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నామని, గడపగడపకు తిరిగి లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటున్నామని చెప్పుకునే పాలకులు ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మన్య ప్రాంతంలో కనీస అవగాహన లేని, రేషన్, ఆధార్ తదితర కనీస మౌలిక ధ్రువీకరణ పత్రాలు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నవాళ్లు మన్య ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. అవగాహన లేక ఇటువంటి అధిక సంతానం కలిగివుంటున్న కుటుంబాలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత గ్రామంలో ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, వాలంటీర్ వ్యవస్థ పై లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తమ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అధిక సంతానాన్ని పోషించలేక ఇబ్బంది పడుతున్న సింహాచలం అభ్యర్థిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img