Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నూతన ఏడాదిలో అందరికీ మంచి రోజులు

ఇచ్చిన మాట తప్పడం జగన్ కే చెల్లు

అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేసే రోజులకు నేటితో చెక్

గిరిజన సంఘం నాయకుడు డాక్టర్ వి హేమ నాయక్

విశాలాంధ్ర – చింతపల్లి :- నూతన ఏడాదిలో అందరికీ మంచి రోజులు రానున్నాయని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో ద్వారా, అలాగే పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 98% అమలు చేశామని ప్రజల్ని మభ్యపెట్టి తప్పు త్రోవ పట్టించి మోసం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వంలోని వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని గిరిజన సంఘం నాయకుడు డాక్టర్ వి హేమానాయక్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు కోరే కోరిక గొంతెమ్మ కోరిక కాదని, ఎన్నికల సమయంలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే, స్పందించకుండా వాళ్ల జీవితాలతో ఆడుకోవడం తగదన్నారు. అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ తీస్తానని చెప్పి, నాలుగున్నరేళ్ల లో జాబ్ క్యాలెండర్ తీసిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇటీవల రెండు నోటిఫికేషన్ లు ఇచ్చినప్పటికీ ఆ పరీక్షలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసి రోడ్డు మీదకు లాగడం వైకాపా ప్రభుత్వానికే చెల్లిందని, మధ్య నిషేధమని చెప్పి మోసపూరిత వాగ్దానం చేస్తే అక్కా, చెల్లెమ్మలు, ఆడబిడ్డలు తమ బ్రతుకులు బాగుపడతాయని ఓట్లు వేసి గెలిపిస్తే మాట తప్పిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర లో నిలిచిపోయారని విమర్శించారు. పాదయాత్రలో ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి తో పాటు సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్ రద్దు, పిఆర్సి అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో నిరుద్యోగుల కొరకు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని గతంలో ట్రైకార్ రుణాలు ఇచ్చేవారని, ఈ ప్రభుత్వం కనీసం ఆ రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు. వందకు వందశాతం గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, జీవో నెంబర్ 3 ను మంగళం పాడిన గిరిజన ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గుర్తుండిపోతారన్నారు. అమలు సాధ్యం కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక వాటిని విస్మరించి సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఇటువంటి తప్పుడు హామీలతో మోసం చేసిన వైకాపాను ప్రజలు గమనిస్తున్నారని, నూతన ఏడాదిలో రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. ప్రజలను తప్పు త్రోవ పట్టించడానికి ఇలాంటి హామీలు ఏ పార్టీ వారూ చేయరాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించవలసిన అవసరం ప్రతి వ్యక్తిపై ముఖ్యంగా ప్రతిపక్షాలపై ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img