మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర- ధర్మవరం : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో 13 వాలంటరీ పోస్టులు ఖాళీగా ఉన్నవని, ఆ పోస్టుల కొరకు అర్హులైన యువతి యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు లేదా 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కలదని తెలిపారు. ఆసక్తి కలవారు ఈనెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తదుపరి పురపాలక సంఘమనందు ఈనెల 27వ తేదీ నుండి 28వ తేదీ వరకు రెండు రోజులు పాటు ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని తెలిపారు. ఇంటర్వ్యూలకు అప్లికేషన్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, కుల ధ్రువీకరణ పత్రము, పదవ తరగతి మార్కు లిస్టు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోల తో హాజరు కావలసి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.