Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఏపీ లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

ఏపీ భవన నిర్మాణకార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే ఉప్పు శ్రీనివాస్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జె. రాజారెడ్డి, ఏపీ భవన నిర్మాణకార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి వడ్డే ఉప్పు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.గురువారం స్థానిక కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జె. రాజారెడ్డి మాట్లాడుతూ…
కేంద్ర ప్రభుత్వం 1996వ సంవత్సరంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2009 సంవత్సరంలో మన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనుట కొరకు ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంక్షేమ బోర్డు నందు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది కార్మికులు నమోదు చేసుకొని సంక్షేమ కార్డులు పొంది సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారన్నారు. ఇప్పటి సి ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అప్పటి నుండి పని చేయు ప్రదేశములలో ప్రమాదములు వలన మరణించిన లేక సహజ మరణం చెందిన లేదా ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం లేక పాక్షికంగా అంగవైకల్యం కలిగిన కార్మికులకు వారి కుటుంబమునకు ఇచ్చే పారితోషికములతోపాటు భార్య లేదా కుమార్తెలకు 2 కాన్పులకు ఇచ్చే పారితోషికములు మరియు కార్మికుల పిల్లలకు ఇచ్చే స్కాలర్ షిప్ ని నిలిపి వేశారన్నారు. ఏపీ భవన నిర్మాణకార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే ఉప్పు శ్రీనివాస్ ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి సి . మల్లికార్జున మాట్లాడుతూ… సుమారు రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పైచిలుకు క్లెయిములు పెండింగ్లో ఉండట వలన కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగులో ఉన్న క్లెయిములకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేయాలన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మా వద్ద నుండి సభ్యత్వ రూపంలోనూ మరియు నిర్మాణ యజమాని నుండి సెసు పేరుతో వసూలు చేయబడిన కోట్ల రూపాయలను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ చట్టాలను ఉల్లంఘించారన్నారు. ఆ నిధులను ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు వాడుకొని కార్మికులకు అన్యాయం చేస్తూ ఉందన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెక్కాడితే కానీ డొక్క ఆడని కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అనేక కుటుంబాలు వీధుల పాలయ్యాయి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నుండి పవర్ ఫైనాన్స్ పేరుతో కార్పొరేషన్లకు దారిన మళ్లించుకున్న నిధులను వెంటనే బోర్డు నందు జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఇతర రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలోను ప్రభుత్వ స్కీమ్లు పధకాలతో సంబంధం లేకుండా కార్మిక సంక్షేమ బోర్డును పటిష్టంగా అమలు చేసి పెండింగులో ఉన్న క్లైమ్ ములు పరిష్కరించి వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన వివాహ కానుక జీవోను రద్దుచేసి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కుమార్తెల వివాహములకు విద్యార్హతతో సంబంధం లేకుండా 40 వేల రూపాయలు ఇచ్చే విధముగా ప్రకటించాలన్నారు. అడ్డాల వద్ద షెల్టర్లు నిర్మించి కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని వారు పేర్కొన్నారు.
నూతనంగా సంక్షేమ కార్డుల కొరకు అప్లై చేసుకున్న కార్మికులకు వెంటనే సంక్షేమ కార్డులు మంజూరుచేయాలని , సంక్షేమ బోర్డును సరైన గాడిలో పెట్టి సక్రమంగా నడిపించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాఫర్, శ్రీనివాసులు, పవన్ కుమార్, హరి, రోషన్ బి, సావిత్రి, భవాని,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img