Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్)

విశాలాంధ్ర- అనంతపురం : సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సాధారణ ఎన్నికలు – 2024పై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల కమీషన్ సూచనల ప్రకారం కౌంటింగ్ కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం జేఎన్టీయూలో పార్లమెంట్ నియోజకవర్గం మరియు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జేఎన్టీయూ మెయిన్ బిల్డింగ్, ఈసీఈ డిపార్ట్మెంట్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కౌంటింగ్ చేపట్టడం జరుగుతుందన్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమీషన్ జిల్లాకు ముగ్గురు పరిశీలకులను నియమించడం జరిగిందని, అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పరిశీలకులుగా మనీష్ సింగ్ ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమల అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ఎన్నికల పరిశీలకులుగా సి.అజయ్ నాథ్ ఝ , రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అజయ్ కుమార్ ను కౌంటింగ్ అబ్జర్వర్లుగా నియమించడం జరిగిందని, అబ్జర్వర్లు ఆదివారం జిల్లాకు చేరుకుంటారన్నారు. కౌంటింగ్ కు ఒక గంట ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుందని, మంగళవారం ఉదయం 06:30 గంటల తర్వాత అభ్యర్థులు / చీఫ్ ఏజెంట్లు అందుబాటులో ఉండాలన్నారు. తాడిపత్రి ఆర్.ఓ రాంభూపాల్ రెడ్డి ఆరోగ్యం బాగాలేక బీపీ విపరీతంగా పెరిగి సెలవు పెట్టడం జరిగిందని, ఆయన స్థానంలో తాడపత్రి రిటర్నింగ్ అధికారిగా శిరీషను ప్రభుత్వం నియమించిందన్నారు. ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్ ని లెక్కించడం జరుగుతుందని, అనంతరం 30 నిమిషాల తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ సూచనలను జారీ చేసిందన్నారు. అభ్యర్థులకు, ఏజెంట్లకు జేఎన్టీయూలోని మూడు బ్లాక్స్ వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి ప్యాక్డ్ ఫుడ్ అందించడం జరుగుతుందని, అందులో బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, లంచ్ ఉంటుందని, పేమెంట్ బేసెస్ లో ఫుడ్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు శనివారం సాయంత్రం 5 గంటలలోపు ఏజెంట్ల నియామకానికి పేర్లు నమోదు చేసుకోవాలని, 5 గంటల తర్వాత ఎవరు పేర్లు ఇచ్చినా ఐడి కార్డు ఇవ్వడానికి వీలు ఉండదన్నారు. నాలుగవ తేదీ ఏజెంట్లంతా ఉదయం 7 గంటలలోపు కౌంటింగ్ హాల్ లోపల ఉండాలన్నారు. అభ్యర్థులు, రాజకీయ ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు అందిస్తున్నామని, క్రమశిక్షణతో ఉండే వారిని ఏజెంట్లుగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల అధికార యంత్రాంగంపై నమ్మకం ఉంచాలన్నారు. కౌంటింగ్ గది ఎన్నికల కమీషన్ పరిధిలో ఉంటుందని, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రవర్తించాలని, ఏవైనా ఇబ్బందులు కలిగిస్తే, వాయిస్ రైజ్ చేసినా బయటికి తీసుకెళ్లడం జరుగుతుందని, ఎలాంటి సమస్య లేవనెత్త రాదన్నారు. కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, కౌంటింగ్ సిబ్బందికి అన్ని శిక్షణలు ఇచ్చామని, అన్ని రకాల సందేహాలను నివృత్తి చేశామన్నారు. కౌంటింగ్ గదిలో సీటింగ్ ఏర్పాట్లను చేపట్టామని, ఎండ తీవ్రత వల్ల టవర్ ఏసీలు ఏర్పాటు చేశామని, కారిడార్లలో తాగునీరు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు గెలిచిన తర్వాత అందుబాటులో ఉండాలని, వారికి సర్టిఫికెట్ అందించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ అనంతరం ఈవీఎంలను గోడౌన్ లో భద్రపరచాల్సి ఉందని, అందులో అందరి భాగస్వామ్యం ఉందని, అందరూ సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ రమేష్ రెడ్డి, నోడల్ అధికారి నరసింహారావు, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి బి.నారాయణప్ప, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఏజెంట్ ఎంఎండి ఇమామ్ వలీ, వైఎస్ఆర్సిపి ఎన్నికల ఏజెంట్ ఎం.రమణ, జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థి చిన్న రామప్ప నాయక్, స్వతంత్ర అభ్యర్థులు కేతిరెడ్డి రఘునాథరెడ్డి, వడ్ల కేశవయ్య, స్టాండింగ్ కమిటీ మెంబర్లైన బిజెపి ప్రతినిధి ఈశ్వర ప్రసాద్, టిడిపి ప్రతినిధి చెరుకుతోట పవన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img