Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు తప్పవు

మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో చిరు, పెద్ద వ్యాపారస్తులు, తోపుడుబండ్ల వారు ప్లాస్టిక్ ని వాడితే కఠిన చర్యలతో పాటు భారీ జరినామ విధిస్తామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం కాయగూరల మార్కెట్, ఎన్టీఆర్ సర్కిల్ ,ప్రధాన కూడలి వద్ద గల దుకాణాల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగల్ ప్లాస్టిక్ వాడుతున్న వాటిని షాపుల, తోపుడుబండ్ల ద్వారా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి అందరికీ గట్టి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఇకముందు ప్లాస్టిక్ ని వాడితే షాపును సీజ్ చేస్తామని, కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ఏ దుకాణంలోనూ తోపుడు బండలోనూ సింగిల్ ప్లాస్టిక్ వాడకం ఉండకుండా గట్టి చర్యలు చేపట్టాలని శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషాను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి ఆంజనేయులు, మున్సిపల్ సానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img