Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా మహాసభను జయప్రదం చేయండి

విశాలాంధ్ర- ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి లో జనవరి 17వ తేదీ ఉదయం 10:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలోఏపీ చేనేత కార్మిక సంఘం మొదటి మహాసభను నిర్వహిస్తున్నామని ఈ సభకు అధిక సంఖ్యలో చేనేతరు పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కదిరి గేటు వద్ద గల నేతన్న విగ్రహం వద్ద మహాసభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సభకు సభాధ్యక్షులుగా వెంకటనారాయణ, ముఖ్య అతిథులుగా ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పామిశెట్టి గోవిందు, సిపిఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏపీ చేనేత కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, సోమందేపల్లి సిపిఐ మండల కార్యదర్శి బాలస్వామి తదితరులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, చేనేత అడ్వైజర్ బోర్డును పునరుద్దించాలని, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయమును ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, చేనేతపై జిఎస్టి రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 45 సంవత్సరాలు నిండిన ప్రతి చేనేత కార్మికునికి పెన్షన్ ఇవ్వాలని, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, రెండు లక్షల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా ముద్ర రుణాలు ఇవ్వాలని, చేనేత వస్త్రాల అమ్మకాలపై 20 శాతము రిబీట్ పునరుద్దించాలని, హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, నూలు, పట్టు పై 40 శాతం సబ్సిడీ ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్ లో చేనేత రంగానికి 25 వేల కోట్లు నిధులను కేటాయించాలని తెలిపారు. వేయి1936 నుండి చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ చేనేత కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ దిష్టికి దూసుకెళ్తూ, కార్మికుల పక్షాన పోరాడుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వాలు చేనేతల చట్టాన్ని తుంగలో తొక్కి, విచ్చలవిడిగా పవర్ రూమ్స్ లో చేనేతరకలు నేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి ఫలితమే నేడు చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. ఇప్పటికైనా చేనేత పరిశ్రమలు కాపాడవలసిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని వారు తెలిపారు. ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుండి చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, చేనేత నాయకులు పోలా లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, బాల రంగయ్య, జింక కేశవ, రామాంజనేయులు, మల్లికార్జున, సురేష్, నాగరాజుతోపాటు అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img