Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అనంతపురం కలెక్టరేట్ లో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి దంపతులు కేక్ కట్ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్, కలెక్టర్ భర్త ఎం.రోహిత్ లు కేక్ కట్ చేశారు. అనంతరం డిఆర్ఓ గాయత్రీ దేవి, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున ప్రజలు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు, పండ్లు, బొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలకు జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, ఆర్డీవో గ్రంధి వెంకటేష్, డీపీఓ ప్రభాకర్ రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నాగరాజారావు, ఐ.అండ్.పి.ఆర్ డిఐపిఆర్ఓ పి.గురుస్వామి శెట్టి, బిసి కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, పీఆర్ ఎస్ఈ భాగ్యరాజ్, ఎల్డిఎం సత్యరాజ్, డిఈఓ నాగరాజు, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర రెడ్డి, డిఆర్డిఏ మరియు హౌసింగ్ పీడీ నరసింహారెడ్డి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, మెప్మా పిడి విజయలక్ష్మి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు విశ్వనాథ్, బాలాజీ, పుణ్యవతి, డిఎస్ఓ శోభారాణి, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, మార్కెటింగ్ ఎడి చౌదరి, డిఎల్డివో ఓబులమ్మ, స్పందన తహసీల్దార్ మారుతీ, తహసీల్దార్ బాలకిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img