Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్
విశాలాంధ్ర – పామిడి(అనంతపురం జిల్లా) : గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆర్. జితేంద్ర గౌడ్ తన క్యాంప్ కార్యాలయం నందు ఏపీ బడ్జెట్ పై పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అప్పులాంధ్రప్రదేశ్ గా మారిందని, అన్ని వర్గాలను నిరాశపరిచే విధంగా బుగ్గన బడ్జెట్ ఉందని విమర్శించాడు.పన్నుల బాదుడు తప్ప బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమీ లేవని, అంకెల గారడీ తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు.రూ.13వేల కోట్ల రెవిన్యూ లోటును రూ.44వేల కోట్లకు, రూ 35 వేల కోట్ల ద్రవ్య లోటును రూ.60 వేల కోట్లు పెంచిన ఘనత బుగ్గనదని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.11.58లక్షల కోట్లు, మద్యం బాండ్లు రూ.16వేలు కోట్లు, కార్పొరేషన్ హామీలు రూ.1,10,603కోట్లు, కార్పొరేషన్ తనఖాలు రూ.94,928 కోట్లు, డిస్కమ్ బకాయిలు రూ.27,284కోట్లు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు 95,400కోట్లు వైసిపి హయాంలో రెట్టింపు అయినా ఏపీ అప్పులు. 2019లో టిడిపి తీసుకున్న దాని కంటే 4 రెట్లు అప్పు చేసారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం ఇప్పటివరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, సర్ చార్జీల పేరుతో మరింతగా ప్రజల నడ్డి విరుస్తూ చార్జీలు వసూలు చేస్తుందన్నారు. నాడు నేడు పేరుతో స్కూలుకు వేసిన రంగులలో 3 వేల కోట్ల అవినీతి, విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల్లో రూ.1000 కోట్లు అవినీతి, జగనన్న విద్యా దీవెనలో 7లక్షల మంది విద్యార్థులు కోత విధింపు, నాసిరకం మద్యం అమ్ముతూ రూ.30వేల మందిని పోట్టన పెట్టుకున్న జగన్ సర్కార్ మద్యం మీద వచ్చే డబ్బుతో ప్రభుత్వం నడిపిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ కి బడ్జెట్ లో నిధులు అంతంత మాత్రమే అని టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ రద్దు చేసిన ఘనత సైకో ప్రభుత్వనిదని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు, రూ.35 లక్షల పొదుపు గ్రూపులకు బడ్జెట్ లో మొండి చేయి, రైతు భరోసా ద్వారా లబ్ధిదారుల సంఖ్య తగ్గించి సున్నా వడ్డీ పంట రుణాలను 5 లక్షల నుంచి 3 లక్షలకు కుదింపు చేశారని, పేరుకే బీసీ సంక్షేమం సబ్ ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లు దారిమళ్లింపు,30 పథకాలు రద్దు చేసిన జగన్ రెడ్డికి, వైసిపి ప్రభుత్వానికి దక్కిందని వైసిపి హయాంలో తీసుకొచ్చిన ప్రతి స్కీమ్స్ స్కామ్ గా మారిందని సైకో రెడ్డిని గద్దే దింపటానికి ప్రజలు వేచి చూస్తున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కేశప్ప,రాయల్ రామయ్య, తలారి మస్తానప్ప, జింకల జగన్నాధం,రామన్న చౌదరి,కృష్ణ రెడ్డి, కురుబ శివన్న, గోపాల్,రంజాన్,చంద్రయ్య,రవి, రామాంజనేయులు, సురేంద్ర, మల్లేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img