Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపలేదని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. దస్తగిరి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన అవినాష్ రెడ్డి తండ్రి వై ఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో ఇద్దరు నిందితులైన ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img