Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మోదీ తెంపరితనం

సుప్రీంకోర్టు అంటే మోదీ సర్కారుకు ఎంత వ్యతిరేకత ఉందో ఇటీవలి కాలంలో రెండోసారి రుజువు అయింది. ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ఉద్దేశించిన కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పును తోసిపుచ్చాలని మోదీ సర్కారు నిర్ణయించింది. దీనికోసం పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించనున్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పుచెప్పడం అంటే దానికి శాసనప్రతిపత్తి ఉంటుంది. కానీ శాసనాలను అడుగడుగునా బేఖాతర్‌ చేయడంలో తెంపరితనం ప్రదర్శిస్తున్న మోదీ సర్కారు ప్రతిపాదించబోయే కొత్త బిల్లులో ప్రధాన న్యాయమూర్తికే స్థానంలేకుండా చేయాలని నిర్ణయించింది. దిల్లీ పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివే అని సుప్రీంకోర్టు తీర్పుచెప్తే అది చెల్లకుండా చేయడానికి మోదీ సర్కారు మొదట ఆర్డినెన్సు జారీచేసి ఆ తరవాత బిల్లు ప్రతిపాదించి ఆమోదింపచేసుకుంది. ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిగా అరుణ్‌ కుమార్‌ గోయల్‌ను నియమించడానికి కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల సమయంకూడా పట్టలేదు. ఈ హడావుడిపై అనేక విమర్శలు తలెత్తాయి. అప్పుడే సుప్రీంకోర్టు ముగ్గురుసభ్యుల కమిటీ ఉండాలనడంతోపాటు అందులో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని తీర్పు చెప్పింది. ఆ రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి లేరు. న్యాయమూర్తులు కె.ఎం.జోసఫ్‌, అజయ్‌ రస్తోగి, అనిరుధ్‌ బోస్‌, రిషీకేశ్‌ రాయ్‌, కుమార్‌ ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్ర చూడ్‌ అంటే బీజేపీ సర్కారుకు కంపరం. ఆయనను లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ సఫలం కాకపోవడంతో మోదీ సర్కారు ఇరకాటంలోపడిరది. ఇప్పటిదాకా ప్రభుత్వ సిఫార్సు ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, మిగతా ఇద్దరు కమిషనర్లను నియమిస్తున్నారు. ఈ నియామకానికి ఇన్నాళ్లుగా చట్టం ఏమీలేదు. అయితే ఈ అంశంపై పార్లమెంటు బిల్లు తీసుకురావచ్చునని అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. ఈ మాట ఆసరాగా మోదీ సర్కారు ప్రధాన న్యాయమూర్తికే ఆ కమిటిల్లో సభ్యత్వంలేకుండా చేసే రీతిలో బిల్లు ప్రవేశపెట్టనుంది. అదేమంటే కొత్త చట్టం తీసుకు రావొచ్చునని మీరే చెప్పారుగా అని దబాయించడం మోదీ సర్కారు ఎత్తుగడ. కేంద్రప్రభుత్వ ఆలోచన ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడితో పాటు ఒక కాబినెట్‌ మంత్రి ఉంటారట. ఆ కాబినెట్‌ మంత్రిని ఎటూ ప్రధానమంత్రే నామినేట్‌ చేస్తారు. ఇక ఎదురే ఉండదు. అంటే తమ ఇష్టానుసారం ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమంచేస్తోంది. ఎన్నికల కమిషనర్లను, ముఖ్యంగా ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిని ప్రధానమంత్రే నియమిస్తే ఆయన ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించగలరు అని సుప్రీంకోర్టు సందేహం వెలిబుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పడానికి వెనుకాడడం లేదు. చంద్రచూడ్‌ మోదీ సర్కారుకు కంటిలో నలుసులా తయారయ్యారు. మోదీ ప్రభుత్వం నిరంకుశంగా మారకుండా సుప్రీంకోర్టు అంకుశం ఉపయోగిస్తోంది. సుప్రీంకోర్టు నిర్దేశించడం మోదీ సర్కారుకు అసలే మింగుడు పడలేదు.
మార్చి రెండున సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే ఆరునెలలుగా నోరు మెదపని మోదీ సర్కారు ఇదే అదును అని కొత్త చట్టం ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ త్రిసభ్య కమిటీలో ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటే, మరో సభ్యుడు ప్రతిపక్ష నాయకుడైతే తాము కోరుకున్న వ్యక్తిని లేదా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను కమిషనర్లుగా నియమించడం కుదరదని ప్రభుత్వానికి అర్థం అయినందువల్లే కొత్త బిల్లు గురించి మాట్లాడుతోంది. సుప్రీంకోర్టు సూచించిన కమిటీయే ఉంటే అందులో ఉండే ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే తమ ఆటలు సాగవని మోదీ సర్కారుకు తెలుసు. అందుకే ఏకంగా ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేయాలని ప్రభుత్వం భావించింది. అనేక ముఖ్యమైన పదవుల నియామకంలో ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. అప్పుడు మొగ్గు ప్రభుత్వపక్షం వేపే ఉంటుంది. దానికి అనుగుణంగానే కొత్త బిల్లుకు రూపకల్పన జరుగుతోంది. అనేక రాజ్యాంగ వ్యవస్థలను మోదీ సర్కారు తమకు అనుకూలంగా మార్చుకుంది. మార్చుకోవడం అసాధ్యమైనప్పుడు లొంగదీసుకుంది. కానీ ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నికల నిర్వహణలో, ఓటర్ల జాబితా తయారు చేయడంలో, ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించడంలో రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు ఉంటాయి. ఫ్రజాస్వామ్యంలో ఓటుకున్న శక్తి అపారం. ఎంత బలమైన ప్రభుత్వాన్ని అయినా అవకాశం వచ్చినప్పుడు ప్రజలుగద్దె దించగలరు. ఇంతకన్నా ఎక్కువ మెజారిటీ ఉన్న సమయంలో కూడా ఎన్నికలలో ఆ ప్రభుత్వాలు ఓడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ వ్యవస్థకే వెన్నెముక లేకుండా చేయడమే మోదీ సర్కారు లక్ష్యం. అప్పుడు ఎన్నికల కమిషన్‌ నామమాత్రంగా మిగిలిపోతుంది. రాజ్యాంగ నిర్దేశానికి విలువలేకుండా పోతుంది. మోదీ ప్రభుత్వానికి కావలసిందే ఇది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషన్‌ కోరలను మోదీ సర్కారు ఎప్పుడో పెరికి వేసింది. ఇదే విధానం కొనసాగించడమే అసలు లక్ష్యం. ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. వాటికి ప్రభుత్వం జవాబివ్వకుండా ప్రధాన న్యాయమూర్తి పాత్ర లేని కమిటీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అయింది. ఈ ఏడాది ముగిసేలోగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌్‌, మిజోరం, తెలంగాణ శాసన సభలకు ఎన్నికలు జరగవలసి ఉంది. వచ్చే ఏడాది మేలోగా సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు బీజేపీకి దాదాపు జీవన్మరణ సమస్య. ఇందులో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలోనే కాక మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీకి ఎదురుగాలే ఉంది. అలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్‌ తమకు అనుకూలంగా వ్యవహరించాలని బీజేపీ తాపత్రయ పడ్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకునే ఎన్నికల కమిషనర్లు ఉంటే పరిస్థితి సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. మోదీకి కావలసింది సరిగ్గా అదే. రాజ్యాంగ నిర్దేశాలు గాలికి కొట్టుకుపోయినా ఆయన లక్ష్యపెట్టరు. సుప్రీంకోర్టు నిర్దేశం తమకు అనుకూలంగా లేదనుకున్నప్పుడు మోదీ కొత్త చట్టం రూపొందిస్తారు. నియామక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి ఉన్నంత మాత్రాన ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేస్తుందనుకోలేం అని విచారణ సందర్భంగా ప్రభుత్వం వాదించడమే అత్యున్నత న్యాయస్థానం అంటే మోదీ సర్కారుకు ఎంత వెగటో రుజువు చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img