Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి….

టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…

విశాలాంధ్ర -ఏలూరు: మణిపూర్ బాధితులకు రక్షణ కల్పించి, మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మణిపూర్ అల్లర్లను తీవ్రంగా ఖండిస్తూ భారతరత్న అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షురాలు జాలా సుమతి బాలాజీ, నగర 3 డివిజన్ క్రిస్టియన్ ఐక్య వేదిక సంఘం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరియమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జాలా బాలాజీ మాట్లాడుతూ మణిపూర్ లో జరిగిన మారణకాండ కు నైతిక బాధ్యత వహిస్తూ మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్ర డిజిపిని తక్షణమే సస్పెండ్ చెయ్యాలని కోరారు. మణిపూర్ లో జరుగుతున్న దాడులు కేవలం ఒకటి రెండు తెగలపై కాదని భారత రాజ్యాంగంపై మతోన్మాద మనువాద వారసుల దాడి అన్నారు. బిజెపి ప్రభుత్వం మతం, కులం పేరుట చిచ్చుపెట్టి మణిపూర్ లో అత్యంత విలువైన ఖనిజ సంపదను కాజేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్న గిరిజనులపై దాడులు చేస్తోందని విమర్శించారు. మణిపూర్ లో గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన అత్యంత అమానుషమైన, హేయమైన చర్య అన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అత్యాచారాలు జరుగుతున్నా ఆ రాష్ట్రం, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలకు చీమకుట్టినట్టైనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలమైన ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర
డిజిపిని సైతం బర్తరఫ్ చేయాలన్నారు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లను ఖండిస్తూ ప్రధాని మోడీ నోరు మెదకపోవటం దారుణం అన్నారు. ఆయన మౌనం వెనుక బిజెపి, ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. మోడీ కుట్రలను ప్రజలందరూ ఐక్య ఉద్యమాలతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలే జోసఫ్, పాస్టర్ స్వరూప్,రవి, సరిపల్లి పెద్దిరాజు, మహిళలు, సంఘస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img