Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

యువతలో రాజకీయ చైతన్యం పెంపొందాలి…

అభివృద్ధి లేని రాష్ట్రంతో యువత భవిష్యత్తు అంధకారం అయ్యింది…

దెందులూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్…

విశాలాంధ్ర పెదవేగి: విద్యా, ఉద్యోగ అంశాలతో పాటు సమకాలీన రాజకీయ పరిస్థితులపై కూడా యువతలో చైతన్యం కలిగి ఉండాలని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన సంజయ్ బాబీ ఆధ్వర్యంలో దాదాపు 50మంది యువత బుధవారం ఉదయం దుగ్గిరాలలోని నియోజకవర్గ కార్యాలయానికి చేరుకుని చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో తెలుగుపార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తూ అభినందించారు. రాబోయే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపు జెండా ఎగుర వేయడంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక చొరవ చూపాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు.
ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత 5 ఏళ్ళ వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిలిచి పోయి రాష్ట్రంలోని లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిపోయిందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణం పట్ల, ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల టిడిపి జనసేన బిజెపి కూటమి ఎంతో చిత్తశుద్దితో కృషి చేస్తుందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించేది యువతే అని, అటువంటి యువతకు రాజకీయ చైతన్యం ఉండాలని, సోషల్ మీడియాను వినియోగించుకుని ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని చింతమనేని ప్రభాకర్ యువతకు సూచించారు. ఎటువంటి తాయిలాలు ఇవ్వకుండానే ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో యువత స్వచ్చంధంగా తరలి వచ్చి కూటమికి మద్దతు ఇస్తున్నారంటే వైసిపి పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అందరికీ అర్థం అవుతుందని చింతమనేని ప్రభాకర్ అన్నారు. టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వంలో యువతకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి పెదపాడు మండల అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, క్లస్టర్ ఇంచార్జి ముళ్ళపూడి సాంబశివరావు, నూతలపాటి నవీన్, యాధాన దయాకర్, భీమరాజు, ప్రభుదాస్, పెదవేగి, దెందులూరు మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రామ్ ప్రసాద్, సహా పలువురు నియోజక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img