Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి

విశాలాంధ్ర – భీమవరం : సి ఆర్ జెడ్ ప్రాంతాన్ని పక్కాగా గుర్తించి పర్యాటక అభివృద్ధికి ఇబ్బందులేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సంబంధిత అధికారులకు సూచించారు.
శుక్రవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో నరసాపురం తీర ప్రాంతంలో నూతనంగా గుర్తించిన ఆరు బీచ్ లను కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్లాన్ లో చేర్చడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పర్యాటక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద రాజు మాట్లాడుతూ మ్యాపులను రూపొందించే ముందు సి. ఆర్.జెడ్ ప్రాంతాన్ని పక్కగా గుర్తించాలని సూచించారు. సముద్ర ప్రాంతానికి ఒక కిలోమీటర్ దూరంగా ఉన్న వేముల దీవి ప్రభుత్వ భూముల్లో టూరిజం అభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుపై అభ్యంతరాలను విశదీకరించాలని సభలో అధికారులను కోరారు. టూరిజం అభివృద్ధికి గోదావరి బండ్ పై తలపెట్టిన ప్రాజెక్టును వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరారు. సముద్ర తీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేని రీతిలో పర్యావరణ అనుకూల బీచ్ లను తీర్చిదిద్దాలన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన రోస్టల్ జోన్ రెగ్యులేషన్ చట్టంను అనుసరించి తీర ప్రాంతంలో బీచ్ లను అభివృద్ధి చేయడం జరుగుచున్నదని తెలిపారు. ఫిషరీస్ విశ్వ విద్యాలయం, పర్యాటక, మత్స్యశాఖలతో కూడిన 11 ప్రత్యేక బృందాలు తీరం వెంట సర్వే నిర్వహించి బీచ్ ల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు.. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ టూరిజం పేరిట మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయ నున్నట్లు తెలిపారు. నూతనంగా జిల్లాలో గుర్తించిన ఆరు బీచ్ లను జిల్లా సమావేశంలో ఆమోదింప చేసి కోస్టల్ జోనల్ మాస్టర్ ప్లాన్ లో పొందుపరచడానికి పంపడం జరుగుతుందన్నారు. కోస్తా జిల్లాల్లో మొత్తం 288 బీచ్‌లను బృందాలు గుర్తించాయని, వాటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 6 బీచ్‌లను గుర్తించడం జరిగిందన్నారు. వాటిలో వేముల దీవి గ్రామంలోని వేముల దేవి బీచ్, పెదమైనవానిలంక గ్రామంలోని పెదమైనవానిలంక బీచ్, కె.పి పాలెం సౌత్ గ్రామపంచాయతీలోని కె.పి పాలెం బీచ్, పేరుపాలెం సౌత్ గ్రామ పంచాయతీలోని పేరుపాలెం బీచ్,
పేరుపాలెం సౌత్ గ్రామ పంచాయతీలోని కనకదుర్గ బీచ్, పేరుపాలెం సౌత్ గ్రామపంచాయతీలోని మొళ్ళపర్రు బీచ్ లు వున్నాయి.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ పి ఎ.వి సుబ్బరాజు, జిల్లా రెవిన్యూ అధికారి కె కృష్ణవేణి, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామి నాయుడు, ఉభయ గోదావరి జిల్లాల టూరిజం అధికారి యండిహెచ్ మెహర్రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా డి.మహేశ్వరరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ కె. వేంకటేశ్వర రావు, టూరిజం ఇఇ యస్. రాజారావు, డిఇ జి.సత్య నారాయణ, నరసాపురం తహ శీల్దారు యస్.యం ఫాజిల్, మొగల్తూరు తహశీల్దారు జి.అనితాకుమారి, టూరిజం మేనేజరు యస్.పట్టాభి, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img