Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

దిల్లీ మద్యం కేసులోకవిత అరెస్టు

. బంజారాహిల్స్‌ నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు
. ఎమ్మెల్సీని దిల్లీకి తరలించిన అధికారులు
. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే…
. నేడు వైద్యపరీక్షలు ` రేస్‌ కోర్స్‌ అవెన్యూ కోర్టులో హాజరు
. న్యాయపోరాటం చేస్తాం: కేటీఆర్‌, హరీశ్‌రావు
. నేడు తెలంగాణవ్యాప్తంగా ఆందోళనకు బీఆర్‌ఎస్‌ పిలుపు

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తనయ, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కె.కవిత శుక్రవారం అరెస్టు అయ్యారు. దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు మహిళలతో సహా 12 మంది దర్యాప్తు అధికారులు నాలుగు గంటల పాటు కవిత ఇంటిని సోదా చేశారు. అనంతరం కవితను అరెస్టు చేసి రాత్రి 8:45 గంటల విమానంలో దిల్లీకి తరలించారు. అక్కడ నుంచి నేరుగా ఈడీ కార్యలయానికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే ఉంచుతారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి, మధ్యాహ్నం రేస్‌ కోర్స్‌ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. నిందితుడు అమిత్‌ అరోరా ఇచ్చిన సమాచారం మేరకు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసినట్లు తెలిసింది. నాలుగు రోజులుగా అరోనాను ఈడీ ప్రశ్నించగా సౌత్‌ లాబీ కీలక సమాచారాన్ని అతను వెల్లడిరచాడు. దీని ఆధారంగా కవితను అధికారులు అరెస్టు చేశారు. కాగా, అరోరాతో కలిపి కవితను కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇది అక్రమ అరెస్టు అని, తన కేసు సుప్రీంకోర్టులో పెండిరగ్‌లో ఉన్నప్పుడు ఎలా అరెస్టు చేస్తారని కవిత, ఆమె భర్త అనిల్‌ కూడా ప్రశ్నించినప్పటికీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పనిని చేసుకుపోయారు. అయితే ఈడీ నోటీసులను బేఖాతరు చేసినట్లు కవితపై ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ… సమన్లను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండిరగ్‌లో ఉన్నందున ఈడీ కార్యాలయానికి రాలేనని దర్యాప్తు అధికారులకు కవిత లేఖలు పంపారు. న్యూదిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు ఆమె మూడుసార్లు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆమెను తొలుత విచారించిన సీబీఐ అనంతరం నిందితుల జాబితాలో కవిత పేరును చేర్చి నోటీసులు జారీ చేసింది. కవిత అరెస్టు గురించి తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ఆమె నివాసం వద్దకు చేరుకొని వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. భారీ బందోబస్తు నడుమ ఆమెను శంషాబాద్‌కు తరలించారు. కవిత అరెస్టుకు నిరసనగా శనివారం తెలంగాణ వ్యాప్త ఆందోళనకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.
అరెస్టుపై 14పేజీల మెమో..
కవితను శుక్రవారం సాయంత్రం 5.20గంటలకు అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడిరచారు. అరెస్టుకుగల కారణాలు వివరిస్తూ 14 పేజీల మెమో అందజేశారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్‌కు అరెస్టు గురించి సమాచారం ఇచ్చామని తెలిపింది. కవిత మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 3 కింద నేరానికి పాల్పడ్డారని ఈడీ వెల్లడిరచింది.
కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత
కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్రప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండటమే కాకుండా ఎన్నికలకు ముందు అరెస్టులు ఏమిటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు కొందరు కవిత నివాసానికి చేరుకున్నారు.
ఇది రాజకీయ కక్షసాధింపు: కవిత
శంషాబాద్‌కు తీసుకెళ్లే సమయంలో తన నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత బీఆర్‌ఎస్‌ శ్రేణులకు అభివాదం చేశారు. మనోధైర్యంతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టంపై నమ్మకంతో ఎదుర్కొందామన్నారు. అణచివేతలు ఎన్ని జరిగినా పోరాడదామని, మనోధైర్యంతో ముందుకు వెళదామని పిలుపునిచ్చారు.
ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్టా?
ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం రోజున సోదాలు, అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కవిత ఇంట్లోకి తమను వెళ్లనివ్వకపోవడాన్ని తప్పుపట్టారు. అరెస్టు చేయొద్దన్న సుప్రీం మాటను లెక్క చేయని ఈడీ అధికారులు… కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అరెస్టుని అడ్డుకోవద్దని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్‌, హరీశ్‌రావు సూచించారు. శాంతియుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని, అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. న్యాయపరంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటామని కవిత కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు తెలిపారు.
అధికారులతో వాగ్వాదం
కవిత నివాసానికి వెళ్లిన కేటీఆర్‌, హరీశ్‌ రావును లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. అంతా పథకం ప్రకారమే జరిగిందని, ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీశ్‌రావు తెలిపారు. కవిత అరెస్టును ఖండిరచారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకే కవిత అరెస్టు చేయించేలా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు.
కవిత పిటిషన్‌పై సుప్రీం విచారణ 19కి వాయిదా
దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులనూ ఆమె సవాల్‌ చేశారు. సీఆర్పీసీ 41ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆమెకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దీంతో కవిత సీబీఐ, ఈడీల ముందు మళ్లీ హాజరవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో ఈనెల 19న జరగనున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img