Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

సింగరేణి గనుల వేలంపై నిరసన జ్వాల

. అవసరమైతే రాష్ట్ర బంద్‌ పిలుపునిస్తాం : కూనంనేని
. కలెక్టరేట్ల వద్ద ధర్నా విజయవంతం

విశాలాంధ్ర – హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల వేలం రద్దు చేయాలనీ, గోదావరి పరివాహక ప్రాంత సింగరేణి గనులు సింగరేణికే కెేటాయించాలని డిమాండ్‌ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరాఫీసుల ముందు ధర్నా విజయవంతమైంది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వినాశకర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గనుల వేలం రద్దు చేయకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సింగరేణిని కాపాడుకోవడం కోసం వివిధ రూపాలలో ఉద్యమాలు కొనసాగిస్తామని, అవసరమైతే తెలంగాణ బంద్‌ కూడా పిలుపునిస్తామని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభాపక్షం నేత కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా సీపీఐకి మద్దతుగా నిలబడాలన్నారు. దేశ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టే కేంద్రంలోని బీజేపీ విధానాలను నిరసించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు వేలం పాటను రద్దు చేసి, బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణి కాలరీస్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లక్డీకాపూల్‌ వద్దనున్న సింగరేణి భవన్‌ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ, ఈటి నర్సింహ, అంజయ్య నాయక్‌ (సీపీఐ), డీజీ నరసింహారావు, సాగర్‌, ఎం.శ్రీనివాస్‌ (సీపీిఎం), గుమ్మడి నరసయ్య (సీపీఐ మాస్‌ లైన్‌), జేవీ.చలపతి రావు, సాధినేని వెంకటేశ్వర రావు (సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ), ధర్మతేజ పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ దేశాన్ని కాపాడాల్సిన వాళ్లే దొంగకు తాళం చెవి ఇస్తే ఆ దొంగ ఎంత భద్రతగా కాపాడుతాడో ప్రధాని మోదీని చూస్తే అర్థం అవుతుందన్నారు. బందిపోటు దొంగల్లాంటి కార్పొరేట్‌ అధిపతులతో మోదీ కుమ్మక్కై దేశ సంపదను విక్రయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ ఆస్తి తెలంగాణ వెలుగు సింగరేణిని కూడా కార్పొరేట్‌ అధిపతులకు అప్పగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణి పెద్ద సంస్థ అని, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏ ప్రభుత్వానికి కూడా సింగరేణి సంస్థ లాంటిది లేదన్నారు. బొగ్గుగనులు మనవి, బొగ్గును కనిపెట్టింది సైంటిస్టులని, ఆ బొగ్గును కాపాడేందుకు శేషగిరి, కొమురయ్య, పర్సా సత్యనారాయణ లాంటి వారు ఎందరో కృషి చేశారనీ, అనేక మంది ఉమ్మడి కమ్యూనిస్టులు సింగరేణిని కాపాడుకుంటూ వచ్చారన్నారు. పావలా జీతం దగ్గర నుంచి గౌరవ ప్రదమైన వేతనాలు ఉండేలా సింగరేణిని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా తీర్చిదిద్డారని కూనంనేని గుర్తు చేశారు. ఆ సింగరేణి ద్వారానే దక్షిణాది రాష్ట్రాలలో కరెంటు సరఫరాకు అయ్యే బొగ్గు మొత్తం సింగరేణి నుంచి సరఫరా అయ్యే పరిస్థితి ఉన్నదన్నారు.
నాడు వంత పాడి…ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న కేసీఆర్‌
సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్‌ చట్టాన్ని 2015లో పొందపర్చినప్పుడు , కెేసీఆర్‌ కూడా వారికి వంత పాడుతూ చేతులెత్తారని కూనంనేని సాంబశివరావువిమర్శించారు. ఏ రాష్ట్రంలోని గనులనైనా తీసుకునేలా చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఇటువంటి భయంకరమైన చట్టాన్ని తీసుకురావడంలో మోదీ, కెసిఆర్‌ ఇద్దరూ నాడు చేతులు కలిపారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అదే కేసీిఆర్‌ ఇప్పుడు గుండెలు బాదుకుంటూ ఆ చట్టంలో అంశంలో తమ పాత్ర లేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేసీిఆర్‌ ఎంత నటించినప్పటికీ మన చేతుల్లోని చట్టాన్ని కేంద్రం చేతిలో పెట్టారన్న అంశం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. సింగరేణికి ఎంతో భవిష్యత్తు ఉన్నదనే ఉద్దేశంతోనే 1973లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో దీనిని ప్రభుత్వ రంగంలోనికి మార్చారని, దీని వెనకాల ఏఐటీయూసీ, సీఐటీయూ ఇతర సంఘాల పోరాటాలు ఉన్నాయన్నారు. ఇటువంటి సింగరేణిని ప్రైవేటీకరించే అవకాశాన్ని కేంద్రానికి ఎవరిచ్చారని కూనంనేని నిలదీశారు. సీిఎం రేవంత్‌ రెడ్డి తన దిల్లీపర్యటనలో ప్రధాని మోదీని కలిసి ఒక వినతి పత్రం అందజేశారని, అలాంటి దరఖాస్తులతో మోదీ లొంగుతాడా? అని అన్నారు. డీజీ నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అనేక అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. తాము ప్రైవేటీకరించడంలేదని, 51 శాతం రాష్ట్రానిదే అని ఒక సారి, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు కట్టబడి పని చేస్తామని మరో సారి మాట్లాడుతున్నారని తెలిపారు. సింగరేణిని కాపాడుకునేందుకు మరిన్ని సమరశీల పోరాటాలు చేయాల్సిన పరిస్థితి మరో సారి వస్తోందన్నారు. గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని కోరారు. ఎవరొచ్చి వేలం పాడుతారో చూద్దామన్నారు. జేవీ చలపతిరావు, సాధినేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ వామపక్ష పార్టీలుగా అందరం కలిసి సింగరేణి ని కాపాడుకునేందుకు పోరాడుదామన్నారు. దఫదఫాలుగా ప్రతి రోజూ ఉద్యమాన్ని కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌ యూసుఫ్‌, ఎన్‌ఎఫ్‌ ఐ డబ్ల్యూ నాయకురాలు జ్యోతి, సీపీిఐ నాయకులు కాంపల్లి శ్రీనివాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు చైతన్య యాదవ్‌ , ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిలో భారీ ధర్నా
విశాలాంధ్ర -పెద్దపల్లి/సింగరేణి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గోదావరిఖని ఆర్జీ వన్‌,,టు,త్రీ మూడు ఏరియాల నుంచి వందలాది మంది ఏఐటీయూసీ కార్యకర్తలు 30 కి.మీ.దూరం బైక్‌ ర్యాలీగా పెద్దపల్లి కలెక్టర్‌ ఆఫీసుకు ముందు ధర్నాలో పాల్గొన్నారు. సీఐటీయూ, సీపీఐ, సీపీఎం కు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.అనంతరం ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐ, సీపీఎంకు చెందిన నాయకులు కె.రాజకుమార్‌, తాండ్ర సదానందం, ఎల్‌.ప్రకాశ్‌, వైవి.రావు, మడ్డి ఎల్లయ్య, కె.సునీల్‌, కె.రాజరత్నం, జూపాక రాంచందర్‌, క.స్వామి, ఆరెల్లి పోషం, జిగురు రవిందర్‌ తదితరులు ప్రతినిధి వర్గంగా వెళ్లి అదనపు కలెక్టర్‌ అరుణశ్రీకి విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజకుమార్‌ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ నిజాం ప్రభుత్వం గతంలోనే మైనింగ్‌ లీజులు మంజూరు చేసినందున, గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో బొగ్గు క్షేత్రంలో సింగరేణి అన్వేషణ జరుగుతోందని, ఎంఎండిఆర్‌ చట్టం,1957లోని సెక్షన్‌.4(1) ప్రకారం అన్వేషణ, తవ్వకాల కోసం సింగరేణిని మినహాయించారన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని వేలం రద్దయేవరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img