Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అభివృద్ధి హడావుడి

. సీఎం సుడిగాలి పర్యటనలు బ ప్రారంభాలు, శంకుస్థాపనలు
. కోడ్‌ రాకుండానే పనులు చక్కబెట్టే యత్నం
. అదే బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం ఆసన్నం కావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు ప్రజలకు చేరువయ్యే అభివృద్ధి కార్యక్రమాలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. హడావుడిగా ప్రారంభాలకు, శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు ఈ దిశగా నిమగ్నమ్యారు. ఇప్పటివరకు చేసిన అభి వృద్ధి పనులకు ప్రారంభాలు, మరో వైపు చేయ బోయే వాటికి శంకుస్థాపనలు చేస్తున్నారు. సిద్ధం సభలు ముగిసిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తూనే… మరోవైపు సీఎం జగన్‌ ప్రారంభోత్సవాలపై ప్రధాన దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపైనా నిపుణులతో సీఎం చర్చిస్తున్నారు. మధ్య మధ్యలో పార్టీలో చేరికలపై దృష్టి పెడుతున్నారు. దాదాపు వారం రోజుల్లోనే కడప, ఎన్టీఆర్‌, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్‌ సుడిగాలిలా పర్యటించారు. కడప జిల్లాలోని పులివెందులలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని సీఎం ప్రారంభించారు. ఆదిత్యా బిర్లా గార్మెంట్స్‌ యూనిట్‌ను, వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ పార్క్‌, పులి వెందులలో మినీ సెక్రటేరియట్‌, బనానా ఇంటి గ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ను సీఎం ఏకకాలంలో ప్రారం భించారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ కనకదుర్గ వారిధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్‌, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌, వైఎస్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిని సీఎం ప్రారంభించి… అక్కడి ప్రజలను నేరుగా కలిశారు. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు సీఎం అంద జేశారు. నంద్యాలలో ఈబీసీ నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జమచేశారు.అంతకుముందు బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్‌జీసీ పైపులైన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 మంది బాధితులకు తొలి విడతగా రూ.161.86 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఆయా సభల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై సీఎం విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం బాటలోనే 175 నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, ఎంపీలు అభివృద్ధి కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని), ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌ అధ్వర్యంలో సింగ్‌నగర్‌లో ఆర్టీసీ బస్‌ డిపోకు భూమి పూజ చేశారు. పిఠాపురంలో ఇంకా పూర్తికాని బీసీ సంక్షేమ భవన్‌ను కాకినాడ ఎంపీ వంగా గీత ప్రారంభించడంపై దుమారం రేగింది. దీనిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసనకు దిగగా… పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడ చేనేత భవనాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి అధ్వర్యంలో ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా కుళాయి కనెక్షన్ల నుంచి రోడ్ల వరకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇక నిరుద్యోగులకు కాస్త ఊరట నిచ్చేలా 6,100 పోస్టులతో డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ పరీక్షలను వేగవంతంగా నిర్వహించి, ఫలితాలను ప్రకటించాలన్న ప్రభుత్వ ఆశయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ పరీక్షలను మరో నెల రోజులపాటు ముందుకు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద వైసీపీ అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారం, ప్రారంభోత్సవాలు తదితర అంశాల్లో సీఎం జగన్‌ పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈనెల 16వ తేదీన 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు తుది జాబితా ప్రకటించనున్నారు. అనంతరం 18వ తేదీ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూచించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలపై సీఎం దృష్టి పెట్టినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img