Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

ధరల దరువు

. అందనంత ఎత్తులో నిత్యావసరాలు
. పేద, సామాన్య వర్గాలపై ఆర్థికభారం
. నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యం
. రాయితీ సరుకులు అరకొరే

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మార్కెట్లో నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పేద, సామాన్య వర్గాల ప్రజలు రోజువారీ నిత్యావసరాలు కొనుగోలు చేయలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. చిన్నపాటి ఉద్యోగులకైతే వచ్చే అరకొర వేతనంలో సగం సొమ్మును వాటి కేటాయింపులకే సరిపోతున్నది. ఏడాది కాలంగా నిత్యావసరాల ధరలు ప్రతీది అడ్డూ అదుపులేకుండా పెరుగుతునే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కూడా అదుపులోకి రాలేదు. వ్యాపారస్తులు ధరలను ఎడాపెడా పెంచేస్తున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన దాదాపు మూడు నెలల్లోనూ ధరల అదుపులోకి రాలేదు. గత ప్రభుత్వ పాలనలో ధరలతో ప్రజలు చితికిపోగా, కూటమి ప్రభుత్వంలో ఊరట కలుగుతుందని ఆశిస్తున్నారు. మార్కెట్లో ధరలతోపోటీగా రైతు బజార్లలోనూ నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. సాధారణంగా మార్కెట్లో ఉండే ధరలతో పోలిస్తే, రైతు బజార్లో కిలోకు రూ.10 వరకు తేడా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి రైతు బజార్లలో లేదు. రూ.500తో రైతు బజారుకు వెళ్లినా..సంచి నిండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. బియ్యం దగ్గర నుంచి మినప పప్పు, కందిపప్పు, వంట నూనె సామాన్యుడికి అందుబాటులో లేదు. చింతపండు, పంచదార, అల్లం తదితర సరుకుల ధరలు అమితంగా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, ఆకు కూరల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. హోల్‌సేల్‌ వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించడం, దళారీ వ్యవస్థ, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి సరిగ్గా లేకపోవడం కూడా కొంతవరకు కారణం. కాగా వ్యాపారస్తులు ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నప్పటికీ, వాటి నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించలేకపోతున్నాయి. వాటిపై నిత్యం రవాణా, పౌర సరఫరాల శాఖాధికారులు దాడులు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ధరల నియంత్రణపై గత ప్రభుత్వంలో నిరంతరం సమీక్షలు, చర్యలు లేకపోవడంతోనే హద్దూ, అదుపులేకుండా పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరల నియంత్రణకు చర్యలు చేపట్టడంలేదు. అటు నిత్యవసర ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని నిరసిస్తూ, సెప్టెంబరు 1నుంచి 6వ తేదీ వరకు పెరుగుతున్న ధరల నియంత్రణ కోసం సీపీఐ రాష్ట్ర సమితి వ్యాప్తంగా ఆందోళనకు కార్యారణ రూపొందించింది. అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లోను ధరలకు వ్యతిరేకంగా పోరుబాటకు పిలుపునిచ్చింది. 6వ తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టనుంది.
కొన్ని చోట్లే రాయితీపై బియ్యం, కందిపప్పు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీఐఐసీ కార్యాలయంలో తొలి కౌంటర్‌ను పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేశారు. అనంతపురం, మచిలీపట్నం, పల్నాడు, గుంటూరు, విజయనగరం వాటిని ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రస్తుత మార్కెట్‌ తాజా ధరల ప్రకారం రైతు బజార్లలో కందిపప్పు(దేశవాళి) రకం కిలో 181 ఉండగా, కిలో రూ.150కు చొప్పున ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. బియ్యం(స్టీమ్డ్‌బీపీటీ/సోన మసూరు కిలో ధర రూ.55.85 ఉండగా, దానిని రూ.48కి, బియ్యం(పచ్చి బిపీటీ/ సోనా మసూరి) రకం రూ.52.40 మార్కెట్లో ఉండగా, రూ.47 ధరతో విక్రయిస్తున్నారు. ఈ రాయితీ సరుకులు రాష్ట్ర వ్యాప్తంగా 284 కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నామని మంత్రి మనోహర్‌ ప్రకటించినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో అన్ని రైతు బజార్లకు చేరలేదని వినియోగదారులు చెబుతున్నారు. వచ్చిన కొన్ని గంటలకే అయిపోతున్నాయని, అందరికీ అందడం లేదని వాపోతున్నారు. కందిపప్పును రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌లో ఒకే ధరతో విక్రయించాలన్న లక్ష్యంతో 125 క్వింటాళ్ల కందిపప్పును అందజేస్తా మని ప్రభుత్వం ప్రకటించినా…అమలుకు కార్యాచరణ లేదు.
తగ్గని ఉల్లి ధర
ప్రకృతి వైపరీత్యాలతో వస్తున్న మార్పులతో ఉల్లి, టమోటా ధరలు అమితింగా పెరగడం, ఆ తర్వాత తగ్గిపోతున్నాయి. మొన్నటి వరకు టమోటా కిలో ధర 75కుపైగా పెరగగా, ప్రస్తుతం కిలో రూ.27కు తగ్గిపోయింది. నాడు మార్కెట్లో టమోటా కొనుగోలు చేయాలంటేనే వినియోగదారుడు బెంబేలెత్తగా ఇప్పుడు కొద్దిగా అందుబాటులోకి వచ్చింది. అదే స్థాయిలో ఉల్లి ధర ఘాటెక్కుతోంది. మార్కెట్‌లో రూ.50కుపైగా ధర పలుకుతుండగా, రైతు బజార్లలో రూ.44 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర అధికంగా ఉండటంతో సామాన్యుడు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు బజార్లలో రాయితీపై వాటిని అమలు చేయడం లేదు. నిత్యం రైతు బజార్లల నుంచి ప్రజలు కొనుగోలు చేసే బెండ, అరటి, కాకరకాయ, దొండకాయ తదితర కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. అటు బియ్యం, కందిపప్పు, ఇటు కూరగాయలు, ఆకు కూరలు వెరసి మొత్తం ఎడాపెడా ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు వాటిని కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడిరది. కూటమి ప్రభుత్వం స్పందించి నిత్యవసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img