Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నిండా ముంచిన వాన

మూడో రోజూ వీడని ముసురు

. అంచనాలకందని నష్టం
. వరదలతో జనజీవనం అస్తవ్యస్తం
. ఏపీ`ఒడిశా మధ్య రాకపోకలు బంద్‌
. కృష్ణా, గోదావరికి వరద ఉధృతి
. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో వరుసగా మూడోరోజు కూడా ప్రజలు సూర్యుడిని చూడలేదు. ఎడతెరపి లేని వర్షాలతో కోస్తా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో కనుచూపుమేరలో ఎటుచూసినా వరద నీరే కనపడుతోంది. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వరదల కారణంగా స్థంభాలు నేలకూలి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి అనేక గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. రోడ్లు ధ్వంసమై, కొన్ని చోట్ల గండ్లు పడి కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. గోదావరి ఉపనది శబరికి వరదనీరు పోటెత్తుతోంది. భారీ వరద ప్రవాహంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరుకల్లేరు గ్రామాల మధ్య జాతీయ రహదారికి గండిపడిరది. దీంతో ఏపీ`ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుకిరువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిల్చిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కోస్తాలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాండవ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 365 అడుగులుగా ఉంది. మరోవైపు తాడిగిరి వంతెన పైనుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి అనకాపల్లి జిల్లాలో వరినాట్లు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రామరాజుపాలెం వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కేడీపేట-చింతపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. మరోవైపు వట్టిగెడ్డ జలాశయం పొర్లుకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్‌ నుంచి కాల్వల ద్వారా 3 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. వర్షాల కారణంగా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం వంద అడుగులకు చేరుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వరి పంట నీటిలోనే నానుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 12 వేల హెక్టార్లకుపైగా వరి నాట్లు నీటమునిగాయి. ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట వద్ద గోదావరి 7.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 3 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని వదిలాలు. తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వాడ, ఎర్ర కాలువలు ఉగ్రరూపం దాల్చాయి. ఏలూరు జిల్లాలో పెద్దవాగు ఆయకట్టు తెగిపోవడంతో వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో నిడదవోలు మండలంలోని 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ఏజెన్సీ ఏరియా జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మొత్తానికి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల వల్ల అంచనాలకందనంత నష్టం వాటిల్లింది. విద్యుత్‌ సరఫరా, గండ్లు పడిన రోడ్లకు అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
హోం మంత్రి అనిత సమీక్ష
ఏపీలో వర్షాలపై విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష చేసి…అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో వర్షాల ప్రభావం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్బిణీలు, రోగులను సమీప పీహెచ్‌సీలకు తరలించాలని, సహాయక శిబిరాల్లో బాధితులకు ఏ లోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img