Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

మత రాజ్యస్థాపనకు కుట్ర

. రాజ్యాంగం స్థానే మనుస్మృతి అమలుకు యత్నం
. పార్లమెంటు`విపక్షాలు లేకుండా నియంత పాలన
. వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్‌కు కీలకం
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

న్యూదిల్లీ : భారతదేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. రాముడి పేరిట రాజకీయాలు చేస్తూ, ప్రజల్లో విభజన సృష్టించి ఎన్నికల్లో లబ్ధికి యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ చెప్పే రాముడు… ప్రజలు విశ్వసించే రాముడు వేర్వేరని వ్యాఖ్యానించారు. రాముడు, రామమందిరం పేరిట మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని, కాషాయ ఉచ్చులో దేశ ప్రజలు చిక్కుకోబోరని, వారికి వాస్తవాలు తెలుసని రాజా అన్నారు. రామ మందిరం ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పెద్దగా ఉండబోదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. మోదీ గ్యారెంటీ అనే బీజేపీ నినాదాన్ని కొట్టి పారేశారు. ప్రజలకు మోదీ ఇచ్చే గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. నల్లధనం ఎక్కడ? 20 కోట్ల ఉద్యో గాలు ఏవి? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఎప్పుడు? ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షల జమ హామీ ఏమైంది? అని నిలదీశారు. సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ అన్నారు. కిసాన్‌ కా సాథ్‌ ఏది మోదీజీ అని రాజా ప్రశ్నించారు. ఇవేమీ లేవంటే మోదీ అబద్ధం చెప్పినట్టే కదా అని వ్యాఖ్యానించారు. మోదీ కీ గ్యారెంటీ కేవలం ఎన్నికల గిమ్మిక్కు మాత్రమేనన్నారు. రైతులు తమ డిమాండ్ల సాధన కసం నేటికీ పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారత రత్న ఇచ్చారు కానీ ఆయన సిఫార్సుల అమలునకు విముఖంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజా గురువారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీని గద్దె దించితే తప్ప రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోలేమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు దేశ భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమన్నారు. లౌకిక ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని, దానిపై తరచూ దాడులు జరుగుతున్నాయ న్నారు. బీజేపీని ఓడిరచడం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తక్షణావశ్యమని పిలుపునిచ్చారు. రామ మందిరం ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అనుకోవడం లేదన్నారు. రాముడి గురించి బీజేపీ, ప్రజల మనో భావాలు భిన్నమైనవిగా తెలిపారు. 400 స్థానాల్లో గెలుపు… రాజ్యాంగ సవరణ అంటూ బీజేపీ నాయకులు, చట్టసభ్యులు తరచూ చేసే వ్యాఖ్యల వెనుక మనుస్మృతి అమలుకు కసరత్తు లేదా అన్నదే ప్రజల ప్రశ్న అని రాజా అన్నారు. ‘2024 ఎన్నికలు సంక్లిష్టమైనవి. దేశానికి, దాని భవిష్యత్‌కు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులను దేశం ఎదుర్కొంటోంది. పదేళ్లుగా వినాశకర పాలన సాగుతోంది. గరిష్ఠ పాలన, కనిష్ఠ ప్రభుత్వం అన్నది మోదీ మాటలకే పరిమితమైంది. ఉద్యోగాల కల్పన, నల్లధనం వెనక్కి తేవడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ధరలు తగ్గించడం వంటి వాటిలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని రాజా దుయ్యబట్టారు. పార్లమెంటును నిర్వీర్యం చేసే కసరత్తు జరుగుతోందని, ఇందుకు శీతాకాల సమావేశాల్లో 140 మందికిపైగా ఎంపీల సస్పెన్షే నిదర్శనమని చెప్పారు. ‘దేశ ప్రజల సార్వభౌమత్వానికి పార్లమెంటు ప్రతీక. అది దేశంలోని సర్వోన్నత వ్యవస్థ. ప్రభుత్వాన్ని, దాని విధానాలను ప్రశ్నించేందుకు విపక్షానికి ఇది కేంద్ర బిందువు. పార్లమెంటే నిర్వీర్యమైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది’ అని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నాయని, భారతదేశ నిర్వచనాన్నే మార్చేస్తున్నాయని, భారత చరిత్రను తిరిగి రాయాలని చూస్తున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవడం ఎలా? రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరల్‌ వ్యవస్థ పరిరక్షణ ఎలా అంటూ ప్రశ్నించారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ ఎన్నికల్లో లబ్ధి కోసమేనని, దీని ద్వారా ప్రజలలో మతభావాలు రేకెత్తించి ప్రయోజనం పొందడమే బీజేపీ ఉద్దేశమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించబోదని, ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. రాముడు లేక రామాలయం, అయోధ్య ద్వారా ప్రజలను మభ్యపెట్టలేరని చెప్పారు. ‘రామరాజ్యం అంటే ఏమిటి? కంబా రామాయణం ప్రకారం రామ రాజ్యమంటే అందరూ సమానులుగా ఉండటం. వివక్ష, అసమానతలు, అన్యాయం ఉండరాదు. దీనికి బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ అంగీకరిస్తాయా అన్నదే ప్రజల ప్రశ్న. హిందువులు, ముస్లింలు, సిక్కులు లేక క్రైస్తవులు కలిసి సామరస్యంగా జీవిస్తున్నారు. శత్రుత్వంగానీ, విద్వేషాలుగానీ లేవు. కానీ మతచిచ్చు రగిల్చేందుకు బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నిస్తున్నాయి. దేశాన్ని మతరాజ్యంగా మార్చేయాలని చూస్తున్నాయి’ అని రాజా విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img