Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

మోదీకి ఎదురుగాలి

భావి ప్రధానిగా రాహుల్‌కే జనాదరణ
ఇండియా టుడే సర్వేలో వెల్లడి

న్యూదిల్లీ: భావి భారత ప్రధానిగా రాహుల్‌ గాంధీ సమర్థలు అన్న భావన ప్రజల్లో ఉన్నది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, తాజా పరిణామాలతో ప్రజల ఆలోచనలు, భావాల్లో మార్పు వచ్చింది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి ప్రతికూల పవనాలు బలంగా వీయడం మొదలయ్యాయి. ఆయనకు ప్రజాదరణ గణనీయంగా తగ్గింది. ఔట్‌స్టాండిరగ్‌ ప్రధానిగా ఆయన రేటింగ్‌ క్షీణించింది. రాహుల్‌ రేటింగ్‌ మెరుగైంది. మోదీ రేటింగ్‌ 49శాతానికి పడిపోగా… రాహుల్‌ రేటింగ్‌ 51శాతానికి పెరిగింది. ఈ మేరకు ఇండియా టుడే ‘మూడ్‌ ఆఫ్‌ ది సర్వే’ నివేదిక వెల్లడిరచింది. భావి ప్రధానిగా అర్హులుగా అమిత్‌షాకు 20శాతం మంది, ఆదిత్యనాథ్‌కు 19శాతం మంది, నితిన్‌ గడ్కరీకి 13శాతం మంది మద్దతు లభించినట్లు పేర్కొంది. కులగణనకు 74శాతం మంది అనుకూలంగా ఉన్నారని, ఫిబ్రవరి నాటి ఫలితాలతో పోల్చితే దీనిని సమర్థించే వారు 59శాతం మేర పెరిగారని వెల్లడిరచింది. రైతులకు ఎంఎస్‌పీ కల్పనకు మద్దతిచ్చే వారి సంఖ్య 74శాతం మేర ఉన్నట్లు సర్వే తేల్చింది.
మోదీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నోట్ల రద్దు మొదలు అనేక నిర్ణయాలు దేశాన్ని వెనక్కి నెట్టేవిగా పరిణమిస్తున్నాయన్న భావన బలపడిరది. మతానికి పెద్ద పీట వేస్తూ విభజన రాజకీయాలు చేస్తూ వర్గాల మధ్య చిచ్చు పెడుతూ సమాజాన్ని చీల్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లో నిరసనలు, ఆందోళనలు జరుగుతుండటం, కులగణన, ఎంఎస్‌పీ, నిరుద్యోగం, అవినీతి, పేపర్‌ లీకేజి, ఖాళీల భర్తీ వంటివన్నీ సవాళ్లుగా మారిన ఈ పరిస్థితుల్లో మోదీకి జనాదరణ తగ్గి…భావి ప్రధానిగా రాహుల్‌ గాంధీకి ఆదరణ పెరిగిందని సర్వే నివేదిక పేర్కొంది. జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజాభిప్రాయం మారింది. బీజేపీ నేతృత్వ ఎన్డీయే అధికారంలో ఉన్నప్పటికీ లోక్‌సభలో మైనారిటీగా మిగిలింది.
కంప్యూటర్‌ అసిస్టెడ్‌ టెలిఫోన్‌ సర్వే (సీఏటీఐ)లో మొత్తం 1,36,463 మంది పాల్గొన్నారు. జులై 15 నుంచి ఆగస్టు 10 వరకు సీ`ఓటర్‌ ద్వారా 40,591 మందిని, గత 24 వారాల్లో 95,872 మందిని ఇంటర్వ్యూ చేశారు. భావి ప్రధానిగా ఎవరు సమర్థులన్న ప్రశ్నకు రాహుల్‌ గాంధీ అన్న సమాధానం ఎక్కువగా వినిపించింది. ఔట్‌స్టాండిరగ్‌ ప్రధానిగా మోదీకి ఉన్న రేటింగ్‌ 50శాతం కంటే దిగువకు పడిపోయింది. గత సర్వేలో పోల్చితే ప్రస్తుతం మోదీ అభిమానులు 7.2శాతం మేర తగ్గారు. మరోవైపు రాహుల్‌ రేటింగ్‌ 22శాతం మెరుగైంది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి వాటిని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగిస్తోందా అన్న ప్రశ్నకు 46శాతం మంది అవును అనే సమాధానం ఇచ్చారు. 38శాతం మంది అన్ని ప్రభుత్వాలు ఇలాగే చేస్తాయని చెప్పగా గత సర్వేతో పోల్చితే అధికార దుర్వినియోగం ఎక్కువైనట్లు వారు 46శాతం మంది ఉన్నారు.
ఎన్నికల తర్వాత దేశ ప్రజల ఆలోచనను తెలియజేసే విలువైన సర్వే అంటూ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌నుద్దేశించి రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ అన్నారు. బాధకలిగించే అంశాల్లో ఆర్థికపరమైనవే ఎక్కువని చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థ బాధించే అంశమైంది. ద్రవ్యోల్బణం దిగిరాదు. ఇంటి ఖర్చులు పెరిగాయి, కుటుంబ పోషణ భారమైంది. నిరుద్యోగం తారస్థాయికి చేరింది. ఉద్యోగ కల్పనపై ప్రభుత్వ దావాలపై ప్రజలకు నమ్మకం లేదు’ అని ఆయనన్నారు. ఈస్థాయి నిరుద్యోగం ఎన్నడూ లేదని, మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాల్లో ఇది మొదటిదని యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో జరిగిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే ప్రకారం 52శాతం మంది ఆర్థిక విధానాలు బడా కార్పొరేట్ల లబ్ధి కోసమే రూపొందాయని అంగీకరించగా ప్రస్తుతం ఆ ఆలోచనగల వారు 58శాతానికి పెరిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img