Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 23, 2024
Monday, September 23, 2024

మోదీ ఏలుబడిలోఏపీకి తీరని అన్యాయం

. గత ఐదేళ్లలో నియంత పాలన
. అప్పులపాలైన రాష్ట్రం
. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
. ఏఐటీయూసీ మేధోమథన సదస్సులో రామకృష్ణ

విశాలాంధ్ర-నూజివీడు: గత పదేళ్లలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. ఏఐటీయూసీ అధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి మేధోమథన సమాలోచన కార్యక్రమాన్ని శనివారం నూజివీడులో కే రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … గత ఐదేళ్లలో రాష్ట్రంలో నియంత పాలన సాగిందని, వ్యవస్థలన్నీ కుప్పకూలి రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. దీంతో జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలు, రాజకీయాలు రాష్ట్రంలో చర్చకు రాకుండా పోయాయన్నారు. 2019 ఎన్నికల అనంతరం ఎన్డీఏ పదాన్ని పక్కన పెట్టిన మోదీ ప్రస్తుతం ఎన్డీఏ పేరు చెప్పి ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికారాన్ని చేపట్టారన్నారు. 60 సీట్లు తగ్గిపోయి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ రానప్పటికీ అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అన్న విధంగానే మోదీ పాలన సాగిస్తున్నారన్నారు. ప్రధాన మంత్రిత్వశాఖలను బీజేపీ వారికి కట్టబెట్టి కార్పొరేట్‌ అనుకూల విధానంతో ముందుకెళుతున్నారని ఆయన పేర్కొన్నారు. పదేళ్ల మోదీ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రానికి లేని అవకాశం ఆంధ్ర రాష్ట్రానికి ఉందని… బీజేపీకి లోక్‌సభలో టీడీపీ, రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో గొడవ పడుతున్న ఈ రెండు పార్టీల నాయకులు కేంద్రంలో మోదీకి సలాములు కొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఇరుపక్షాల పైన ఉందని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక వర్గ పార్టీలుగా గుర్తించబడ్డాయని, కార్మికులు, ఉద్యోగులు మెరుగైన జీవితాలు సాగిస్తున్నారంటే దానికి కారణం కార్మికసంఘాల కృషి ముఖ్య కారణం అన్నారు. కార్మిక వర్గంలో కమ్యూనిస్టులు రాజకీయ చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక వర్గానికి దన్నుగా నిలిచే కమ్యూనిస్టు సంఘాలు ఆ దిశగా ప్రభావితం చేయలేకపోతున్నాయన్నారు. సమాజంలో మార్పు రావాలన్నా దేశ రాజకీయాలు మారాలన్నా కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలవైపు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా కార్మికులను చైతన్యం చేయడానికి కార్మిక సంఘాలు తమ పాత పంథాకు స్వస్తి చెప్పి కార్మిక వర్గానికి చేరువయ్యే నూతన మార్గాలను అన్వేషించాలన్నారు. తద్వారా కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్‌, జి.ఓబులేసు, గౌరవ అధ్యక్షులు వీ రాధాకృష్ణమూర్తి, కార్యనిర్వహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు, ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకహోదా తోనే సంక్షోభం నుంచి విముక్తి…
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం నూజివీడులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో రాష్ట్రానికి అన్ని రంగాలలోనూ అన్యాయం జరిగిందన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి సైతం కేంద్రానికి నిధులు రాబట్ట లేక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రం కోలుకుని అభివృద్ధిలో సాగాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు సాధించుకోవడంతో పాటు విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయపట్నం పోర్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img