Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

వచ్చేనెల్లో కృష్ణాడెల్టాకు నీళ్లు

. పులిచింతలలో అర టీఎంసీ నీరు కూడా నిల్వ లేదు
. పట్టిసీమ పథక నిర్వహణనూ దెబ్బతీశారు
. నాలుగైదు రోజుల్లో పంపులన్నీ పనిచేసేలా చర్యలు
. మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గత ప్రభుత్వ అసమర్థత కారణంగా కృష్ణాడెల్టాకు పూర్థిస్థాయిలో సాగునీటి విడుదల ఆగస్టులోనే ఇవ్వగలుగుతామని జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వర్షాకాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజినీర్లతో రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం నిర్మించిన పులిచింతల ప్రాజెక్టులో 30 నుండి 40 టీఎంసీల నీరు నిల్వ ఉండాల్సి ఉండగా… ప్రస్తుతం కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. అలాగే గత నాలుగేళ్లుగా పట్టిసీమ నిర్వహణ పనులు చేపట్టక పోవడంతో గేట్లు, బోల్టులు కూడా తుప్పుపట్టి పోవడంతో పాటు లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దానివల్ల పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏర్పాటు చేసిన 24 పంపుల్లో మూడు పంపులతో మాత్రమే నీటి విడుదల ప్రారంభించగలిగామని తెలిపారు. ప్రస్తుతం 15 పంపులు పనిచేస్తున్నాయని, రానున్న మూడు నాలుగు రోజుల్లో మొత్తం 21 పంపులు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇవన్నీ ప్రారంభమైతే నాలుగైదు రోజుల్లో పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అయితే పూర్తిస్థాయి సాగునీటి సరఫరా ఆగస్టుకల్లా జరుగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితులు తమ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడిరచారు. పులిచింతల ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం, పట్టిసీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన కారణంగానే నేడు కృష్టా డెల్టాలో తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదిన చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుల్లోకి చేరనున్న నేపథ్యంలో ప్రాజక్టుల్లోకి వచ్చే ఇన్‌ ప్లో, అవుట్‌ ప్లో పై, ప్రాజెక్టుల గేట్లు, లాక్‌ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించామన్నారు. మరోవైపు శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల పరిధిలోని కాలువల్లో పేరుకుపోయిన సిల్టును, చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించే పనులను చేపట్టామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్టుల గేట్లు కొట్టుకు పోయాయని తెలిపారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణకు ఏ మేరకు నిధులు వెచ్చించారన్న విషయాన్ని ఆరా తీస్తున్నామని, ఈ ఏడాది ఏ మేరకు నిధులను వెచ్చించగలమో అంచనా వేస్తున్నామన్నారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టుల నిర్వహణ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img