Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సీపీపై ఈసీ తీసుకున్న చర్యతోనైనా మారాలి : పోలీసులకు బోండా ఉమా హితవు

విజయవాడ పోలీస్ కమిషనర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని టీడీపీ నేత బోండా ఉమా స్వాగతించారు. వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తున్న పోలీసులకు ఇదొక హెచ్చరికగా భావించాలన్నారు. ఇది చూసిన తర్వాతైనా పోలీసు అధికారులు మారాలని, మెడలో వేసుకున్న వైసీపీ కండువాలు తొలగించి విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని పోలీసులను హెచ్చరించారు. ఈమేరకు బుధవారం విజయవాడలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ డ్యూటీ చేసే పోలీసులు ఇప్పుడైనా మారాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాము వైసీపీ పరిధిలో కాకుండా ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న విషయం గుర్తించాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. విజయవాడ సెంట్రల్ లో ఏసీపీ, సీఐలు వెలంపల్లి ఆదేశాలకు అనుగుణంగా డ్యూటీ చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బోండా ఉమా తెలిపారు. సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తప్పించాలని ఈసీని కోరనున్నట్లు వివరించారు. అదేవిధంగా మే 1 న లబ్దిదారులకు వారి ఇంటి వద్దే పించన్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img