Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మూడు రోజులు వర్ష సూచన

ఏపీలో చెదురుమదురు వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. అది వేగంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, విశాఖకు దగ్గర్లో ఉందని.. దాని వల్ల తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మూడు రోజులు వర్ష సూచన ఉంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారుతోంది.. మళ్లీ ఆకాశం మేఘావృతం అవుతోంది. ఈ అల్పపీడనం ప్రభావం మంగళ, బుధవారాల నుంచి కనిపిస్తుంది అంటున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీద ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది.

ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఆ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ అల్పపీడనం మయన్మార్ వైపు నుంచి.. ఏపీ వైపుగా కదులుతోంది. ఏపీ వైపు వస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వానలు పడతాయంటున్నారు. ఆదివారం వర్షాలు కాస్త తగ్గముఖం పట్టినా సోమవారం నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయంటున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావణశాఖ అంచనా వేస్తోంది. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీగా వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేశారు.. సోమవారం మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img