Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

విశాఖలో దారుణం.. బాలికపై 10 మంది అత్యాచారం

విశాఖపట్నంలో దారుణం వెలుగుచూసింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ బాలికకు ఈ పరిస్థితి ఎదురైంది. ప్రేమ పేరిట తొలుత ప్రియుడు, అతడి స్నేహితుడు అత్యాచారం చేయగా.. ఆ తర్వాత మరో ఎనిమిది మంది మృగాళ్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరిన బాలికకు భువనేశ్వర్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ నెల 18న బాలికను ప్రియుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం స్నేహితుడిని కూడా హొటల్‌కు పిలిచి అత్యాచారం చేయించాడు. ప్రియుడు నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడంతో మనస్తాపానికి గురవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బాలికకు ఊహించని మరో దారుణం ఎదురైంది. ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్‌కు వెళ్లి ఏడుస్తున్న బాధిత బాలికపై ఓ ఫొటోగ్రాఫర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి నగరంలోని జగదాంబ కూడలికి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఫొటోగ్రాఫర్‌ సహా ఎనిమిది మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజులపాటు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. కాగా బాధిత బాలిక లాడ్జి నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులతో కూడా పంచుకోలేదు. అయితే విశాఖలో పనిచేసిన ఇంటివారు 18వ తేదీనే బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ పట్టణ స్టేషన్ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు. అప్పుడు బాలిక అసలు విషయాన్ని చెప్పింది. తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. నగరానికి చెందిన ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇక తొలుత అత్యాచారానికి పాల్పడిన ప్రియుడు, అతడి స్నేహితుడు పరారయ్యారని, ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఝార్ఖండ్‌, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img