Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిస్తే
కౌలు డబ్బులు ఇవ్వరా?

రైతులు పేదవాళ్లుగా కనబడట్లేదా
అమరావతి రాజధాని రైతుల ఆగ్రహం

విశాలాంధ్ర – విజయవాడ (గాంధీనగర్‌) : పేదల సీఎం అని చెప్పుకుంటున్న జగన్‌మోహన్‌ రెడ్డి పేద రైతులకు అన్యాయం చేస్తున్నారని అమరావతి రాజధాని రైతులు మండిపడ్డారు. రాజధానిలోని ఎస్సీలు పేదవాళ్లుగా కనబడట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం భూములిస్తే అమరావతి రైతులను రోడ్డున పడేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లింపులను నిలిపేయడంపై అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ అధ్యక్షులు పువ్వాడ సుధాకరరావు అధ్వర్యంలో బుధవారం విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అనేక రాజకీయ, ఇతర సంఘాల నాయకులు వచ్చి సంఫీుభావం తెలిపారు. రైతు నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి అని స్వయంగా రాష్ట్రపతి స్పష్టం చేశారని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు తీర్పు శిరోధార్యమని, అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్పును కూడా అవహేళన చేస్తోందన్నారు. అమరావతిలో సీఆర్‌డీఏ మూడు సంవత్సరాల వ్యవధిలో నివాస స్థలాలను అభివృద్ధి చేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ, ఆ విధంగా జరగలేదన్నారు. అమరావతిలో పేదవాడి నుంచి అధికారుల వరకు ఇళ్లు కడతామని ఇప్పటి వరకు పూర్తి చేయలేదని, జగన్‌మోహన్‌ రెడ్డి పథకాలకు డబ్బులు ఇస్తున్నా డే కానీ రైతులకు కౌలు డబ్బులు ఇవ్వటం లేదని విమర్శించారు. కౌలు కోసం రైతులు రోడెక్కటం చాలా బాధాకరం అన్నారు. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల విధానం సాధ్యం కాదని తెలిపారు. రాజధానిలో ఆర్‌`5 జోన్‌ అని ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్క సెంటు ఇస్తున్నారని, కచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును మరుగున పడేశారన్నారు. రాజధాని అమరావతికి తీరని నష్టం చేసిన వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాలు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తేనే రైతులకు కౌలు డబ్బు వేస్తున్నారని, ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. మీరు చేసేది ధర్మ పోరాటమని, సీఆర్‌డీఏ ఇచ్చిన ప్రణాళికకు కట్టుబడి ఉండాలని రాజధాని నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. పేదలకు టిడ్కో ఇళ్లు జగన్‌మోహన్‌ రెడ్డి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. సీబీఐ కేసుల్లో ఉన్న పేర్లు సెప్టెంబరులో బయటకు వస్తాయన్నారు. పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తామని, ఒక్క రూపాయి ఇవ్వకుండా వారిని గోదావరిలో ముంచారని అన్నారు. మీ పోరాటానికి చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. హక్కుగా రావాల్సిన కౌలు డబ్బులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ భూములను ఇచ్చి త్యాగాలు చేశారని, అలాంటి వారికి అన్యాయం చేయరాదని అన్నారు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ అధ్యక్షులు పువ్వాడ సుధాకరరావు మాట్లాడుతూ ఒకవైపు రాజధాని అభివృద్ధి చేయకపోగా… మరోవైపు పత్రాల సాకుతో వార్షిక కౌలు నిలుపుదల చేశారని రైతులు మండిపడుతున్నారని అన్నారు. తాము కోర్టుకు వెళితే వడ్డీతో కౌలు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం గ్రహించాలన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు 1,310 రోజులుగా ఉద్యమం చేస్తున్నారని గుర్తు చేశారు. అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో అధిక శాతం బలహీనవర్గాల రైతులు వారికి ఎకరం నుంచి 3 ఎకరాలు మాత్రమే ఉందని, అటువంటి వారికి కూడా కౌలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు. రాజధానిలోని ఎస్సీలు పేదవాళ్లుగా కనబడట్లేదా అని ప్రశ్నించారు. నమ్మి భూములిస్తే అమరావతి రైతులను రోడ్డున పడేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ 7 వేల మంది రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే వారికి కౌలు డబ్బులు ఇవ్వటం లేదని అన్నారు. ప్రభుత్వానికి భూమిని ఇచ్చింది రాష్ట్ర భవిష్యత్తుతో పాటు వారి జీవనాధారం కోసమని తెలిపారు. అక్షరాల 100 కోట్ల రూపాయలను అసైన్డ్‌ భూముల రైతులకు చెల్లించాలన్నారు. రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి సీపీఐ, కౌలు రైతు సంఘం తరపున పూర్తి సంఫీుభావం, మద్దతు ఉంటుందన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని అసైన్డ్‌ రైతుల వార్షిక కౌలు నిలుపుదలపై ప్రతిసారి హైకోర్టును ఆశ్రయించవలసిన దుస్థితి ఏర్పడిరదన్నారు. అమరావతి కోసం మనం చేసే ఉద్యమం అతి త్వరలో విజయవంతంగా ముగుస్తుందని, రానున్న రోజుల్లో మనకు నచ్చిన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ ధర్నాలో జడ్పీ మాజీ చైర్మన్‌ గద్దె అనురాధ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ, వెలగపూడి గోపాల కృష్ణ, గడ్డం మార్టిన్‌ లూధర్‌, అమరావతి దళిత జేఏసీ కన్వీనర్‌ పోతుల బాలకోటయ్య, వి.కృష్ణయ్య, దేవినేని అపర్ణ, బి.రాజా, మైనర్‌ బాబు, మోతులపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next articleఇక మంటలేనా?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img