Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నా సోదరుడు మళ్లీ ప్రధాని కావడం ఖాయం

పాక్‌ ప్రధాని షెహబాజ్‌
ఇస్లామాబాద్‌: వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ గెలిస్తే ‘పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌ఎన్‌)’ అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధాని అవుతారు… ఈ మాటలన్నది ఎవరో కాదు… పాక్‌ ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌. రాబోయే జనరల్‌ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని షెహబాజ్‌ ధీమా వ్యక్తం చేశారు. కొన్ని వారాల్లో తన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌కు తిరిగి రానున్నాడని షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. దేశంలోని పరిస్థితుల కారణంగా నవాజ్‌ షరీఫ్‌ దేశం విడిచిపెట్టిపోయి 2019 నుంచి లండన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు పాకిస్తాన్‌కు తిరిగి రానున్నాడని, పాకిస్తాన్‌కు మరోసారి ప్రధాని అవుతారని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆత్మాహుతి దాడిలో ఐసిస్‌ ప్రమేయం
పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐసిస్‌ ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ బాంబు దాడిపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన నిందితుడు… జమాయత్‌-ఉలేమా-ఎ-ఇస్లామ్‌-ఫజల్‌ నిర్వ హించిన కార్యకర్తల ర్యాలీలో ముందు వరుసలో కూర్చున్నాడని వెల్లడిరచారు. ఆత్మా హుతి దాడి కోసం 10 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారని పేర్కొ న్నారు. సరిగ్గా సభా వేదిక వద్ద తనను తాను నిందితుడు పేల్చేసుకున్నట్లు వివరించారు. ఇప్పటివరకు.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఖైబర్‌ పఖ్తుంఖ్వా జిల్లా పోలీసు అధికారి నజీర్‌ ఖాన్‌ తెలిపారు. ‘ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నిషేధిత ఉగ్రసంస్థ ఐసిస్‌ హస్తం ఉంది. ఇంకా ఈ పేలుడుపై దర్యాప్తు చేస్తున్నాం… ఆత్మా హుతి దాడిలో మరణిం చినవారి 38 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాం. మరో ఎనిమిది గుర్తుతెలియని మృతదేహాలు ఇంకా ఆస్పత్రిలో ఉన్నాయి. వారు బంధువులు వస్తే వాటిని అప్పగిస్తాం… బాంబు నిర్వీర్య బృందం ఘటనాస్థలిలో ఆధారాల కోసం గాలిస్తోంది. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని నజీర్‌ ఖాన్‌ అన్నారు. మరోవైపు.. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో పేలుడు ఘటనపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందిస్తూ… ఈ పేలుడు ఘటనకు గల బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అలాగే పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఆత్మాహుతి దాడి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా పాక్‌ అంతటా… ముఖ్యంగా ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాద సంఘటనలు పెరగడం మన ప్రాధాన్యాలను పునరాలోచించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. తీవ్రవాద నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో జరిగిన దాడిలో 46 మంది మృతి చెందగా… వంద మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img