Friday, May 3, 2024
Friday, May 3, 2024

అక్రమ ఇసుక రవాణా ను అడ్డుకున్న టిడిపి నాయకులు

విశాలాంధ్ర – నందిగామ రూరల్ న్యూస్ : అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులను అదుపు చేయలేని పరిస్థితిలో నందిగామ సంబంధిత శాఖల అధికారులు ఉన్నారని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంకి వీరస్వామి ఓ ప్రకటనలో పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పరిధిలోని కంచల గ్రామ సరిహద్దులో గల కేసర మునిగేటి నుండి ఇసుక ను అక్రమ రవాణా చేస్తున్న వారిని స్థానిక నాయకులతో కలిసి నిలువరించి అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్దిరోజుల క్రితం అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నేపథ్యంలో అడ్డుకొని అధికారులకు తెలుపటంతో సంబంధిత అధికారులు అక్కడికి చేరుకొని ఇసుక రవాణాను నిలుపుదల చేసి లారీలని సీజ్ చేసినట్లు వివరించారు మరలా మూడు రోజుల గ్యాప్ తో తెలంగాణకు అనుమతి లేని విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్న వారిని సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టపగలు అక్రమ ఇసుక రవాణా చేయటం అలవాటైపోయిందని,రవాణా కు సిద్దంగా ఉన్న 100 టిప్పర్ల ను నిలుపుదల చేసి రోడ్ పై బైఠాయించి లారీల ముందు నిరసన తెలుపుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img