Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఏపీ చేనేతకార్మిక సంఘంచేనేత కార్మికుల నూతన పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వ నూతన నిబంధనలను వెంటనే రద్దు చేయాలి

ఏపీ చేనేతకార్మిక సంఘం

విశాలాంధ్ర – గూడూరు: అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లను మంజూరు చేయాలని ఏపీ చేనేత కార్మిక రాష్ట్ర సహాయ కార్యదర్శి యక్కల. పితాంబరధరరావు కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బి బాల సుబ్రహ్మణ్యం మాజీ రాష్ట్ర అధ్యక్షులు కట్ట హేమ సుందరరావు, సిపిఐ సీనియర్ నాయకులు మోదుమూడి రామారావు , తుమ్మ చిన్న కొండయ్య. చేనేత నాయకులు కె విజ్ఞేశ్వర రావు తదితరులు లతో కలసి కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా హేమ సుందర్ రావు మాట్లాడుతూ అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేయడం తో తమకు జనవరి నెల నుంచి చేనేత పెన్షన్ వస్తుందని సంతోషపడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల వలన కార్మికులు నిరాశకు గురయ్యారు పింఛన్ పొందుటకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛన్ పొందలేకపోతున్నారు కొత్త నిబంధనల ప్రకారం చేనేత కార్మికులు పెన్షన్ పొందాలంటే రెండు సంవత్సరాల పాటు చేనేత వస్త్రాలకు ఉపయోగించే వార్పులు రేషమ్ కొనుగోలుకు సంబంధించిన జిఎస్టి బిల్లులు మరియు ఆన్లైన్ ద్వారా వేతనాలు పొందుతున్నట్లు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తప్పనిసరి అని చెప్పటం చాలా బాధాకరం అని అన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అలాగే చేనేత కార్మికులకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img