Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

కేడీసీసీ బ్యాంకు ను అభివృద్ధి పథంలో నడిపిస్తా

విశాలాంధ్ర – కర్నూల్ సిటీ : అన్ని విధాలుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపిస్తానని కెడిసిసి బ్యాంకు చైర్ పర్సన్ ఎస్వి విజయ మనోహరి తెలిపారు. శుక్రవారం స్థానిక శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జిల్లా సహకర కేంద్ర బ్యాంకు చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి సతీమణి ఎస్ వి విజయ మనోహరి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ జన సందోహం మధ్య ఘనంగా జరిగింది.ముందుగా ఆమె మహానేత వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు .తమ స్వగృహం నుండి వేలాది వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వెంట రాగ భర్త ఎస్ వి మోహన్ రెడ్డి, విజయ పాల డైరీ చైర్మన్ ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి,ఎస్ రామచంద్ర రెడ్డి, నాగ రత్నమ్మలతో కలిసి తనయులు ఎస్ వి జనక్ రెడ్డి, ఎస్ వి సాయి జైదీప్ రెడ్డి లతో కలిసి బైక్ ర్యాలీ వేల మంది జన సమూహం తో నగర పుర వీదుల గుండా లక్ష్మి ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ రామాంజనేయులు ఆమెతో పాటు పాలకవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కుటుంబానికి బ్యాంకు కు విడదీయారని బంధమని, తమ ఎస్ వి సుబ్బారెడ్డి గతం లో జిల్లా చైర్మన్ గా ఆప్కాబ్ చైర్మన్ పదవి ని చేపట్టారన్నారు. బ్యాంకు టర్నోవర్ ను 3000 వెల కోట్ల నుండి 4000 వెల కోట్ల కు తీసుక వెళ్ళడానికి కృషి చేస్తా అని ఆమె తెలిపారు.
ప్రధానంగా మా కుటుంబంలో పాడి పంట లను తమకు జగన్నన్న అప్పగించారని, విజయ పాలడైరీ చైర్మన్ గా ఎస్ వి జగన్ మోహన్ రెడ్డికి పాడి పరిశ్రమ ను, తనకు పంటలను జగన్నన్న అప్పగించారని, ఆయన నమ్మకాన్ని ఎప్పుడు వృధా కానీయన్నారు. సహకార రంగంలోని రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. రైతుల సహకారంతోనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బలోపేతం అవుతుందని, రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి, తిరిగి రుణాలు పొంది సహకరించాలన్నారు. జిల్లాలో 99 ప్రాథమిక సహకార సంఘాలకు గాను 33 సహకార సంఘాలు మల్టీపర్పస్ సెంటర్లుగా రూపాంతరం చెందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్లు కేడీసీసీ బ్యాంకు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img