Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రాబోయే ఎన్నికల్లో భూమా కిషోర్ రెడ్డి కే మా మద్దతు… భూమా కుటుంబ సభ్యులు

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ : రానున్న ఎన్నికల్లో మా కుటుంబం మద్దతు భూమా కిషోర్ రెడ్డి కే అని భూమా కుటుంబం స్పష్టం చేసింది. మంగళవారం భూమా కిషోర్ రెడ్డి స్వగృహంలో భూమా కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ విజయ మిల్క్ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో భూమా కిషోర్ రెడ్డి కే తమ పూర్తి మద్దతు ఉంటుందని కుటుంబ సభ్యులంతా కలిసి భూమా కిషోర్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో భూమా కుటుంబం ఎలా వెళ్లాలి అని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఆళ్లగడ్డ ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ గా ఉందని రాబోయే ఎన్నికల్లో భూమా కుటుంబం అంతా నా వెంటే ఉంటారని వారి మద్దతు నాకే అని భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. అఖిలప్రియ వ్యవహార శైలితోనే భూమా కుటుంబం పరువు దిగజారిందని కిషోర్ రెడ్డి ఆరోపించారు. 2019వ సంవత్సరంలో తాను బిజెపిలో చేరేముందు భూమా కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడే చేరానన్నారు. ఆనాటి నుండి ఆళ్లగడ్డ తాలూకాలో బిజెపిని బలోపేతం చేయడం జరిగిందని క్యాడర్ను బలోపేతం చేసుకున్నామన్నారు. ఫిబ్రవరి 5 లేదా 7వ తేదీ నుండి ఆళ్లగడ్డ నుంచి బిజెపి తరఫున ప్రచారం చేస్తామన్నారు. పొత్తులు అనేది కేంద్ర బిజెపి పార్టీ నిర్ణయం అని వారు మాకు దశ దిశ నిర్దేశం చేశారని అందుకే ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఆళ్లగడ్డ తాలూకాలో ఎంపీటీసీలు, సర్పంచ్ లు అలాగే ఆళ్లగడ్డ పట్టణంలో కౌన్సిలర్లను బిజెపి తరఫున పోటీ చేసి గెలిపించుకున్నామని తాలుకాలో బిజెపి బలంగా ఉందని అలాగే భూమా క్యాడర్ కూడా నాకు మద్దతు ఉంటుందన్నారు. భూమా అఖిలప్రియ వెంట క్యాడర్ ఎవరు లేరన్నారు. పొత్తులో భాగంగా తనకు సీటు రాకపోయినా ఆళ్లగడ్డ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు. భూమా నాగిరెడ్డి చెల్లెలు దేవి, మహేశ్వరి, వీరభద్ర రెడ్డి, భూమా మహేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ భూమా కిషోర్ రెడ్డి కే మా పూర్తి మద్దతు అన్నారు. ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేసిన భూమా కుటుంబం మద్దతు ఉంటుందన్నారు.భూమా కుటుంబ అల్లుడు కాటసాని రఘునాథరెడ్డి తాను పంపిన వీడియోలో మాట్లాడుతూ భూమా కిషోర్ రెడ్డి కి నా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img