Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలి

రాష్ట్ర కో కన్వీనర్ వెంకటేశ్వర్లు మాదిగ

విశాలాంధ్ర ఆస్పరి : ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చట్టబద్దత సాధన కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు/రాష్ట్ర కో కన్వీనర్ శ్రీరాములు మాదిగలు పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్లో ఎమ్మార్పీఎస్ మండల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పి.పులికొండ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాలు మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలో ఏపి లోని ఉషామెహ్రా కమీషన్‌ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ భిల్లు ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్‌ చేసారు. ఎస్సీ వర్గీకరణ భిల్లు ప్రవేశ పెట్టకుంటే మాదిగ మాదిగ కులాలకు న్యాయం కోసం మరో పోరాటానికి ఆంధ్రప్రదేశ్లో ఉండే యావత్ మాదిగలందరూ సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. వాడ వాడకు గడపగడపకు ఉద్యమాన్ని తీసుకువెళ్లి ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

మండల నూతన కమిటీ ఎన్నిక….

ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా తొగలగల్లు సుదర్శన్ మాదిగ, గౌరవ అధ్యక్షులుగా వలగొండ పరశురాం మాదిగ, ప్రధాన కార్యదర్శిగా బిణిగేరి రంగస్వామి లతో పాటు 21 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారెళ్ళ చిన్న అంజి మాదిగ, జిల్లా నాయకులు నెట్టేకల్లు మాదిగ, శేఖర్ మాదిగ, బాలరాజు మాదిగ, పులికొండ మాదిగ, రాజు మాదిగ, సుధా మాదిగ, ఉల్తెప్ప మాదిగ, క్రిష్ణపరంధామ మాదిగ, ఆనందు మాదిగ, హనుమంతు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img