Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

భారతరత్న పీవీ కూడానా..!

జి.నవీన్‌

రెండవసారి ఐదేళ్ల పదవీకాలం ముగిసే దశలో ప్రధాని నరేంద్ర మోదీ మూడోదఫా అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏనాడులేనంత వేగంగా ఐదుగురు విశిష్ట వ్యక్తులకు భారతరత్నలు కురిపించారు. ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి. కొన్ని వారాల్లోనే ఐదుగురికి ఈ అవార్డు ప్రకటించారు. భారతరత్న అవార్డు ప్రవేశపెట్టిన తర్వాత ఏనాడు ఒకేసారి ఇంతమందికి భారత రత్న ప్రకటించలేదు. గాంధీ కుటుంబానికి చెందని కాంగ్రెస్‌ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అత్యంత విశిష్టమైన భారత రత్నల జాబితాలో చేరారు. 1991`1996లో ఐదేళ్లు ఆయన ప్రధానిగా ఉన్నారు. పదవీకాలం పూర్తిఅయిన ఇన్నేళ్ల తరువాత ఆయన భారతరత్న పొందారు. ప్రధాన మీడియాలో కొన్ని ఈ సంఘటనను ఎంతగానో ప్రశంసించాయి. పీవీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు సంఘటనల్లో కావాలని తప్పులకు పాల్పడ్డారు. ఈ తప్పుల వలన ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది. చరిత్రలో ఇది అత్యంత అవమానకరం. అయితే, దేశంలో గొప్ప వ్యక్తులకు ఇవి పెద్ద సమస్యలు కాదని చరిత్ర తెలుపుతోంది.
1984లో దిల్లీలో జరిగిన దాడులు
దిల్లీలో, మరికొన్ని ప్రాంతాల్లో ఆరు కల్లోల రాత్రుల్లో వీధుల్లో సిక్కులను మహాదుర్మార్గంగా ఊచకోత కోశారు. ఈ సందర్భంగా నరసింహారావు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీని రక్షకభటులు కాల్చిచంపాడు. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు రెచ్చిపోయిన సమూహాలు సిక్కులను అత్యంత దారుణంగా ఊచకోత కోశారు. హోంశాఖ మంత్రి అయిన నరసింహారావు దేశరక్షణ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అంచనాప్రకారం 3600 మందిని ఊచకోత కోశారు. వాస్తవానికి హత్యకు గురైన వారిసంఖ్య దిల్లీలోనే ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండవచ్చునని భావించారు. పండితుడు, స్వీయప్రకటిత మేధావి అయిన పీవీ హోంమంత్రిగా ఇంతటి ఘోరకలికి ఎలా అనుమతించారు? 17భాషల్లో మాట్లాడగలిగిన పీవీ సహచర పౌరులపై ఎంతమాత్రం జాలి లేకుండా మౌనంగా ఉండిపోయారు. పీవీని నిరంతరం సమర్థించిన గాంధీయేతర కుటుంబానికి చెందిన కాంగ్రెస్‌ ప్రధానమంత్రిగా రెండుసార్లు పాలించిన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సిక్కు మతస్థుడు. ఆయన పీవీ నరసింహారావును బహిరంగంగానే హెచ్చరించి సైన్యాన్ని పిలిపించాలని బహిరంగంగానే అనేకమార్లు చెప్పినప్పటికీ ఆయన మాటకూడా ఏ మాత్రం వినిపించుకోలేదు. స్వతంత్ర భారత్‌ చరిత్రలో ఇది మచ్చగా మిగిలిపోతుంది. 1992 డిసెంబరు 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టిన ఘటనలో పీవీ రెండవసారి నిందితుడుగా నిలిచిపోయారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కోరుతూ ఆనాటి జనసంఫ్‌ు(నేటి బీజేపీ) నాయకుడు ఎల్‌కే అడ్వాణీ రథయాత్రను నిలిపివేసేందుకు ఏ మాత్రం ప్రయత్నించలేదు. ఇది బాగా తెలిసిన అంశమే. 500 సంవత్సరాల నాటి మసీదును చివరకు కూల్చివేశారు. అడ్వాణీ రథయాత్ర సందర్భంగా దాదాపు 1000 మంది మృతిచెందారని అంచనా వేశారు. ఈ దుర్ఘటన జరిగి చాలాకాలం అయినప్పటికీ జనంలో ఇంకా గుర్తుండిపోయింది.
అడ్వాణీ రథయాత్రను నిలిపివేసేందుకు ఆయనను అరెస్టుచేసి జైలులో పెట్టారు. లాలూ ప్రసాద్‌యాదవ్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పటికీ మత ఉద్రిక్తతలను కూడా అనుమతించారు. పీవీకి సన్నిహితంగా ఉన్నవారు, కొంతమంది ఆయన మంత్రివర్గంలో ఉన్నవారు కావాలనే పీవీ చరిత్రలో ఏనాటికీ పరిష్కారంలేని మతాల మధ్య చీలికలను కూడా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. గత వారంలో లోక్‌సభలో అసదుద్దీన్‌ ఒవైసీ ప్రసంగిస్తూ, కాషాయగుండాలు బాబ్రీమసీదును కూల్చివేస్తుండగా, ప్రధాని పీవీ పూజచేసుకుంటూ ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నారని పేర్కొన్నారు. ఇలా వ్యవహరించిన మొదటి ప్రధానమంత్రి పీవీ అని ఆయన సహచరుడు మణిశంకర్‌ అయ్యర్‌ నిందించారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన సందర్భంగా బీజేపీని పెద్దగా పట్టించుకోనవసరంలేని అనామక పార్టీగా భావించారు. నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అసాధారణంగా విస్తరించింది. 2002లో మసీదు కూల్చివేత జరిగిన తర్వాత అడ్వాణీ, పీవీ ఒకే విధమైన పరిపాలకులుగా ప్రచారం పొందారు. నరేంద్ర మోదీ నీరో చక్రవర్తితో పోల్చదగిన పరిపాలకుడుగా ఉన్నారు. పీవీకాలంలో 1992 లో రెండు అత్యంత దుర్మార్గమైన హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. నేటికీ అంతా తలలు వంచుకోవలసిన సంఘటనలుగా దేశచరిత్రలో నిలిచిపోతాయి.
పీవీ చరిత్రలో గుర్తుండిపోయే మరో భిన్నమైన ఘటనకు ప్రతీకగా ఉన్నారు. మూడవ ఘటన కూడా మచ్చగా మిగిలిపోయేదే. 1993 జులైలో పీవీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. జార్ఖండ్‌ ముక్తిమోర్చా ఎంపీలకు డబ్బు ఇచ్చి అవిశ్వాస తీర్మానంలో రద్దు కావల్సిన ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. పార్లమెంటులో 14ఓట్లతో మళ్లీ విశ్వాసంపొంది ప్రభుత్వం పడిపోకుండా నిలుపుకున్నారన్న పేరు ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఫాలీ నారిమన్‌ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘ఈ సంవత్సరం(1993) అవినీతి భారతదేశంలో వ్యవస్థీకృతమైంది. దేశంలోనే పీవీ ప్రభుత్వం తీవ్రమైన అవినీతిలో మునిగిపోయిందనీ, రాజకీయాలనే అవినీతి బాటపట్టించిందనీ, పీవీ సమస్యను సూట్‌కేసులతో సంస్కరించారని కారత్‌ అన్నారు. లంచం ఇచ్చిన కేసులో పీవీ అంతిమంగా నేరస్థుడని సీబీఐ నిర్థారించింది. అవినీతికేసులో మూడేళ్లు జైలుశిక్షపడిన మొదటి ప్రధానమంత్రి పీవీనే. అయితే మరింత అప్రతిష్టపాలుకాకుండా సుప్రీంకోర్టు ద్వారా ఊరట పొందారు. ఈ మూడు ఘటనలు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడి రాజ్యాంగ సూత్రాలు వృథా అయ్యాయని నిరూపణ జరిగింది. పీవీ కంటే అధిపత్యం కలిగిన పాలనలో భారతరత్న పొందడం పెద్ద విచిత్రమేమీకాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img