Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

వృద్ధులకు ప్రత్యేక ఆసుపత్రి, వృద్ధుల ఆశ్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి..

రిటైర్డ్ కంటి వైద్యాధికారి, కన్ను ,వృద్ధుల వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: వృద్ధులకు ప్రత్యేక ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని రిటైర్డ్ కంటి వైద్యాధికారి, కన్ను, వృద్ధుల వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన కారణంగా ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడి, మరణ శాతం తగ్గి, వృద్ధుల జనాభా అధికంగా ఉందని, ఆయు ప్రమాణాలు పెరిగాయని, వృద్ధుల శాతం సమాజంలో పెరిగిపోవడం జరిగిందని తెలిపారు. దీంతో వృద్ధుల సమస్యలు ఎక్కువ కావడం జరిగిందని, ఆరోగ్య సమస్యలు వృద్ధుల వయసు పై పడిన తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పని చేయని పరిస్థితుల్లో ఉండడం జరుగుతోందని తెలిపారు. ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావాలంటే కుటుంబ సభ్యులు ఆదరణ ఎంతో ఉండాలని, సమాజం, ప్రభుత్వాలు కూడా బాధ్యత కలదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వృద్ధులపై ప్రత్యేక వారి ఆరోగ్యం కొరకై ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పరిచి, వృద్ధుల అనాధాశ్రమాన్ని నిర్మాణం చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులు వృద్ధులపై ప్రేమ, జాలి, కరుణ, గౌరవం తగ్గడంతో వృద్ధులు విధి లేని పరిస్థితుల్లో అనాధాశ్రమంలో చేరడం జరుగుతుందన్నారు. నిరాదరణకు గురి కావడం వల్లనే అనాధాశ్రమంలో చేరడం జరుగుతుందని తెలిపారు. కుటుంబంలోని బిడ్డలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా వారి వద్దనే వృద్ధులు ఉండడం సమంజసమని, అలా కాకుండా ఇంటిలోని కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటూ, ఇండియాలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చడం సరి అయిన పద్ధతి కాదని తెలిపారు. అంతేకాదు వృద్ధులు కూడా గృహహింసకు గురి అవుతున్నారన్న విషయాలను నేడు మనం టీవీలలో వివిధ పత్రికలలో సోషల్ మీడియాలలో చూస్తున్నామని తెలిపారు. వృద్ధులను కుటుంబము నుండి వెలవేసి అనాధాశ్రమలకు తరలించడం దారుణం అన్నారు. కుటుంబములోని వారి నైతిక బాధ్యత వృద్ధులను నిరాదరణకు గురి చేయడం, మానసిక బాధను అనుభవిస్తున్నారని తెలిపారు. వృద్ధులను కుటుంబంలోని వారందరూ కూడా ప్రేమ అభిమానములతో చూసుకున్నప్పుడే వృద్ధులకు సరియైన న్యాయము, భద్రత, రక్షణ కలుగుతుందని తెలిపారు. దేశంలో వివిధ కారణాలతో సమాజానములో నిరాధారణ గురైన వారికి తప్పక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదరించాల్సిన బాధ్యత ఉంది అని తెలిపారు. కేంద్ర, రాష్ట్రములలో గల ప్రతి జిల్లాలో కూడా ఒక వృద్ధ ఆశ్రమం ఉండాలని, వసతి సౌకర్యాలు కూడా కల్పించాలని తెలిపారు. కుటుంబములోని పిల్లలను చిన్నతనం నుంచి వారు ఉన్నత స్థాయి వరకు ఎదిగే వరకు తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా వ్యవహరించినప్పుడు, వారు వృద్ధులైనప్పుడు చూసుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని వారు తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించిన నాడే వృద్ధులకు సంతోషకరమైన, న్యాయమైన అవకాశం వస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img