Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ప్రజా ఉద్యమాలు చేపడతాం

గతంలో వాడుకున్న విద్యుత్తుకు ఇప్పుడు చార్జీలు విధించడం విడ్డూరం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రూపంలో ప్రజలను దోచుకుంటున్నాయి
జిల్లా విద్యుత్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించిన వామపక్ష పార్టీలు

విశాలాంధ్ర – గార/ శ్రీకాకుళం : విద్యుత్ చార్జీలు పెంపుదలకు వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్రావు లు హెచ్చరించారు . శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏపీ ఈ పి డీ సీ యల్ ఎస్ సి కార్యాలయం వద్ద శుక్రవారం వామపక్షాల నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడారు. బిజెపి, వైసీపీ ప్రభుత్వాలు కరెంటు భారాలను ప్రజల నెత్తిమీద వేసి తీవ్ర దోపిడీకి గురిచేస్తున్నయని ఆరోపించారు . స్థిర చార్జీలు , ట్రూ ఆఫ్ చార్జీలు, కస్టమర్ ఛార్జీలు,సర్దుబాటు ఛార్జిల పేరుతో విద్యుత్ వినియోగదారున్ని నిలువునా మోసం చేస్తున్నాయని విమర్శించారు. 2014 నుండి 2019 సంవత్సరాల మధ్యలో వాడుకున్న కరెంటుకు,మళ్ళీ ఇప్పుడు చార్జీలను వసూలు చేసి, వినియోగదారులను దోచుకుంటున్నారని , ఇది తీవ్రమైన అన్యాయమన్నారు. ప్రపంచం మొత్తం మీద కరెంటు చార్జీలు తగ్గాయని, గతంలో సోలార్ విద్యుత్ యూనిట్కు రూ.12 , ఉండగా ఇప్పుడు ఉత్పత్తి ఖర్చు తగ్గి కేవలం రూ.2లకు పడిపోయిన తరుణంలో తక్షణమే కరెంట్ చార్జీలు తగ్గించాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని ఆదానితో పాటు ఇతర కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. స్మార్ట్ మేటర్ల పేరుతో ప్రతి విద్యుత్ కనెక్షన్కు రూ.13వేల భారం వేసి 10 సంవత్సరాలపాటు , ప్రతి నెల రూ.150 చొప్పున అదనంగా భారాలు వేసి సదరు కంపెనీల విద్యుత్ దోపిడీకి , ప్రభుత్వాల పెద్దలే మార్గం సుగమనం చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు కుమ్మక్కై యూనిట్ విద్యుత్తును రూ.2 లకు కొనవలసిన దగ్గర 10 నుండి రూ.12లకు కొంటున్నారని ఆరోపించారు. దీనితో నిబంధనలకు విరుద్ధంగా హిందుజా కంపెనీకి రూ.1200 కోట్లు అప్పనంగా చెల్లించారని తెలిపారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని , 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉచితంగా ఇవ్వాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చాపర వెంకటరమణ, సిపిఐ టౌన్ సహాయ కార్యదర్శి కొమర భాస్కరరావు,సిపిఐ సీనియర్ నాయకులు చిక్కాల గోవిందరావు, సమితి సభ్యులు నిమ్మాడ కృష్ణమూర్తి, సీపీఎం నాయకులు జి సింహాచలం, అల్లు మహాలక్ష్మి, టి తిరుపతిరావు,ఎన్వి రమణ,పొందూరు చందరరావు, అల్లు సత్యనారాయణ, శ్రీదేవి,పాణిగ్రహి,ఎన్ నీలం రాజు,డి భాస్కరరావు,వెంకటరమణ,ఎం కృష్ణ,వెంకట్రావు,యల్ మహేష్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img