Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

క్యాంపస్ కొలువులలో కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల హవా

విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: కొలువులకు సరైన వేదిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల అని డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి,ప్రిన్సిపాల్ కె శివశంకర్ సోమవారం తెలిపారు ఈ సందర్భంగా విరీరువురు మాట్లాడుతూ డిగ్రీ పట్టా అందుకోకముందే ఇప్పటివరకు 250 కార్పొరేట్ ఉద్యోగాలు సాధించడం శ్రీకాకుళం విద్యావ్యవస్థలో చరిత్ర సృష్టించామన్నారు,కాబట్టి ఇంటర్ తర్వాత ఎం చేయాలనీ ఆలోచించకుండా డిగ్రీలో తమ పిల్లలను జాయిన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్ కు దోహదపడాలని తల్లితండ్రులను చూసించారు, మంచి వార్షిక వేతనంతో కార్పొరేట్ కొలువులు (క్యాంపస్ డ్రైవ్స్ )సాధించడం హర్షణీయమని, అందుకు కారణం డిగ్రీ మొదటి సంవత్సరం నుండే ఉద్యోగాలకు ఉపయోగపడే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోందన్నారు,అదేవిదంగా ప్రస్తుత రోజులలో సాఫ్ట్వేర్ రంగాలలో ఎంతో ప్రాధాన్యత ఉన్న కోడింగ్ పైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం అని, అంతేకాకుండా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పై మీ ప్రో,కంప్యూటర్ లాంగ్వేజ్ ల పై సిస్కో,ఒరాకిల్ అకాడమీ లతో అవగహన ఒప్పందాలను చేసుకున్నాం అని ఇవి విద్యార్థినిలకు ఉద్యోగాలు సాధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అన్నారు,వీటితో పాటు ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామన్నారు,క్యాంపస్ కొలువులే కాకుండా అకడమిక్ పైన కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి యూనివర్సిటీ స్థాయి పరీక్షా ఫలితాలలో మొదటి స్థానాలలో ఉంటున్నాం అన్నారు,తమ పిల్లలను ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాలలో ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు ఆశిస్తారని ఆ కోరికను కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలు నిజం చేస్తున్నాయన్నారు,ప్రస్తుతం తమ కళాశాలలో అందిస్తున్న శిక్షణ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుందన్నారు,క్రమశిక్షణ,ఉత్తమ పలితాలు,కార్పొరేట్ కొలువులతో తమ కళాశాల శ్రీకాకుళం జిల్లాలో మొదటి స్థానంలో ఉందన్నారు.ఉద్యోగాలు సాదించిన విద్యార్థినిలను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డా ఎన్.శేషారెడ్డి,సెక్రటరీ డా ఎన్.సుగుణా రెడ్డి,అకడమిక్ డైరెక్టర్ డా బి.ఈ.వి.ఎల్ నాయుడు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img