Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

యోగా కేంద్రంగా రాజకీయ క్రీడ,,,!

  • ఇచ్చిన స్థలం రద్దుకు ప్రయత్నం
  • ఆక్రమణలకు అధికార పార్టీ యత్నం
    విశాలాంధ్ర – ఆముదాలవలస (శ్రీకాకుళం) : యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యమని సన్నాయి నొక్కే ప్రజా ప్రతినిధులు అధికారులు ఆ కేంద్ర నిర్మాణానికి అడ్డంకులు కల్పిస్తూ రాజకీయ
    క్రీడ ఆడుతున్నారు. విషయం తెలిసిన యోగ అభ్యాసకులు ఇదేమి సౌజన్యం అంటూ ఆశ్చ ర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆముదాల వలస పట్టణంలోని సాయి నగర్ వద్ద స్వర్గీ య బిఆర్ రాజగోపాల్ రావు వంశధార ప్రాజె క్టు కార్యాలయం ఉండగా దానికి సంబంధిం చి కొంత ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సర్వే నెంబర్ 30 అనుసరించి 20 సెంట్లు యోగా భవనం నిర్మాణానికి 2004 ఫిబ్రవరి 10వ తేదీన అప్పటి ల్యాండ్ ఎక్కువ చేసిన డిప్యూటీ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంజూరు చేశారు. అందుకు సంబంధించిన పట్టా కూడా నిర్వాహకులకు అందించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రి తమ్మినేని సీతారాం ఫిబ్రవరి 20వ తేదీన యోగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్ర భవన నిర్మా ణానికి అప్పటి మంత్రి ఇప్పటి అధికార శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం భవన నిర్మాణానికి నిధులు సమ కూరుస్తా నని హామీ కూడా ఇచ్చారు. ఈ సమయంలో కేంద్ర నిర్మాణానికి నిధులు వస్తే కేంద్రానికి కేటాయించిన స్థలంలో యోగా నిర్వాహకులు స్థలాన్ని చదును చేశారు. తరువాత నిధులు లేని తో భవన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. మళ్లీ ఇప్పుడు అదే స్థలంపై అధి కార పార్టీ నేతల కన్ను పడింది. ఎలాగూ యోగా కేంద్రం నిర్మించక పోవడంతో దాన్ని బిఆర్ వంశధార ప్రాజెక్ట్ అధికారుల చేతే తమకు సిబ్బంది క్వార్టర్స్ నిర్మించాల్సి ఉందని యోగా కేంద్రానికి ఇచ్చిన స్థలాన్ని తమకు తిరిగి ఇవ్వాలని రెవెన్యూ అధికారు లకు వినతి పత్రం ఇప్పించారు. విషయం తెలిసిన యోగ క్రీడాకారులు అధికారికంగా కేటాయించిన స్థలం తిరిగి ఇచ్చే మనడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నా రు. ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వక పోవడం తోనె యోగా కేంద్ర భవనం నిర్మించ లేకపోతు న్నామని వాపోతున్నారు. కేంద్ర భవన నిర్మా ణానికి నిధులు మంజూరు చేయకుండా ఇచ్చిన స్థలం తిరిగి ఇచ్చే మనడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ స్థలంతో పాటు పరిసర పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 70 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలే స్వాధీనం చేసుకునేందుకు ఇలా అధికారులతో రాజకీయ క్రీడ ఆడుతున్నట్లు తెలిసింది. యోగా భవనానికి కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తే దానితోపాటు చుట్టూ ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే స్థలం అధికార పార్టీ నేతల కొందరు ఆక్రమించు కోవడానికి పావులు కదుపుతున్నట్లు సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది సరికాదని యోగా కేంద్ర నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే నిర్మిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ క్రీడలో అధికార పార్టీ నెగ్గుతుందా లేక యోగా కేంద్రం నిర్మించి విజయం సాధిస్తారు వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img