Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కొల్లేరు కనుమరుగేనా?

. అక్రమ తవ్వకాలు ఆపేదెవరు?
. సుప్రీంకోర్టు ఉత్తర్వులు బుట్టదాఖలు
. అధికార పార్టీ నేతల అండ
. పట్టించుకోని అధికారులు

విశాలాంధ్ర బ్యూరో – ఏలూరు : ఎటు చూసినా పచ్చదనం. పక్షుల కిలకిలా రావాలు… స్వచ్ఛమైన నీటి ప్రవాహాల జోరు… అపారమైన మత్స్య సంపద… ప్రకృతి మాత అందాన్ని రెట్టింపు చేసిన కొల్లేరు గత చరిత్ర. కబ్జాదారుల కబంధహస్తాలలో చిక్కుకున్న కొల్లేరు నానాటికి చిక్కిపోయి…కాలుష్యానికి కేరాఫ్‌గా మారింది.
కొల్లేరులో నిబంధనలు ఉంటాయి కానీ అమలు కావు. చెక్‌ పోస్టులు ఉంటాయి గానీ అక్రమాలను అడ్డుకోవు. పక్షుల కిలకిలారావాలు తప్ప మరేమీ వినిపించకూడని చోట పెద్దపెద్ద శబ్దాలతో పొక్లెయిన్లు తవ్వేస్తున్నా అధికారులకు వినిపించదు, కనిపించదు. రాత్రులు తవ్వడం, పగలు ఆపడం. ఎక్కడి పడితే అక్కడ, ఎలా కుదిరితే అలా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తూ అక్రమార్కులు కొల్లేరును కొల్లగొడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, స్థానికుల సహకారం, రాజకీయ నాయకులు, అధికారులు ఏకమై కొల్లేరు కబ్జాకు ఎవరిసాయం వారందిస్తున్నారు. చివరికి ఆక్రమణకు గురైన కొల్లేరు సరస్సుకు గర్భశోకం మిగిలింది. జరిగేదంతా చట్ట విరుద్ధమే. కొల్లేరు అభయారణ్య దురాక్రమణను ఆపే వారే లేరు. ఎక్కడికక్కడ మోహరించిన పొక్లెయిన్లు… అభయారణ్యంలో అడ్డగోలు తవ్వకాలు… ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న చేపల చెరువులు. ఇదంతా ఎక్కడో కాదు. చేపల చెరువుల తవ్వకాన్ని నిషేధించిన కొల్లేరు కాంటూరు పరిధిలోనే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్‌, ఉంగుటూరు, కైకలూరు, ఉండి నియోజకవర్గాల పరిధిలో ఈ ఆక్రమణలపర్వం మూడు చెరువులు, ఆరుగట్లుగా సాగిపోతోంది. 2006లో చెరువులను ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ధ్వంసం చేసినా…నేడు రాత్రి వేళ మళ్లీ ఆక్రమణలకు యధేచ్ఛగా తెరతీస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలోకి యంత్రాలు ప్రవేశించడం చట్టరీత్యా నేరం. యంత్రాలను కొల్లేరులోకి తీసుకువెళ్లాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. కొల్లేరు ప్రాంతానికి కూతవేటు దూరంలోనే చెక్‌ పోస్టులు ఉన్నా అదే మార్గంలో భారీయంత్రాలు వెళుతున్నాయి. కానీ ఎవరూ నియంత్రించడం లేదు.
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కొల్లేరును పూర్తిగా కబ్జా చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా హామీలు, ఎన్నికల తర్వాత ఆక్రమణలు అనే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చెరువులు తవ్వడం పరిపాటిగా మారింది. 20 నుండి 30 అడుగుల ఎత్తులో గట్లు వేస్తున్నారు. ఎకరం చేపల చెరువు లీజు ఏడాదికి లక్ష రూపాయలు పలుకుతోంది. కొల్లేరు వ్యాప్తంగా ఆరు నెలల నుండి అభయారణ్యంలో తవ్వకాలు పెరిగాయి. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం, నిడమర్రు మండలాలు, మల్లవరం, కైకలూరు నియోజకవర్గం పెదఎడ్లగాడ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద భీమవరానికి చెందిన కొంతమంది బడాబాబులు 300 ఎకరాలు, మండవల్లి మండలం పెనుమాక లంకలో 200 ఎకరాలు తవ్వేశారు. జనవరి నుండి నేటి వరకు 500 ఎకరాలకు పైగా తవ్వినట్టు స్థానికులు తెలుపుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం కోసం భారీగానే ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అటవీశాఖ అధికారులు పాతవాటి మరమ్మతులకు అవకాశం ఇస్తున్నామంటూ ముడుపుల వేటలో మునిగిపోయారు. గతంలో పనిచేసిన ఓ జిల్లా కలెక్టర్‌ 15,700 ఎకరాల్లో ఆక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు నివేదిక ఇవ్వడంతో ఆ కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయడం జిల్లాలో సంచలనమైంది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు బుట్టదాఖలు
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొల్లేరు అభయారణ్యంలో 5వ కాంటూరు పరిధిలో ఎలాంటి తవ్వకాలు జరపరాదు. అయినా బడాబాబులు వీటిని బేఖాతరు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులే తవ్వకాలకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ ప్రేమికులు, కొల్లేరు పరిరక్షణ సమితి అధికారులకు ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. నియోజకవర్గ నాయకుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు చెరువులు తవ్వుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చెరువుల అక్రమ త్రవ్వకాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ప్రసన్నం చేసుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు కొల్లేరు సరస్సును ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు.
అక్రమ చెరువులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే…అది తమ పరిధిలో లేదని ఏలూరు, కైకలూరు రేంజ్‌ అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పంట కాలువల పూడికతీతకు అనుమతి కోరితే నిరాకరించే అధికారులు…అక్రమ చెరువులకు అనుమతులు ఎలా ఇస్తున్నారని కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లా యంత్రాంగం ఇకనైనా దృష్టి సారించి జీవవైవిధ్యాన్ని కాపాడి కొల్లేరును పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రాబోయే కాలంలో కొల్లేరు కనుమరుగై కొల్లేరు సరస్సు గురించి పుస్తకాలలో మాత్రమే చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img